జాతీయ వార్తలు

వాయుసేన సర్వసన్నద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందోన్ (యూపీ), అక్టోబర్ 8: ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి భారత వాయుసేన సిద్ధంగా ఉందని, త్వరలో 36 రాఫెల్ జెట్లు, ఎస్-400 మిస్సయిల్స్ తమదళంలో చేరుతుండటంతో తమ సేన మరింత బలపడుతుందని ఐఏఎఫ్ చీఫ్ బిఎస్ ధనోవా తెలిపారు. ఇక్కడ జరిగిన ఎయిర్‌ఫోర్స్ డేలో ఆయన మాట్లాడారు. ఇటీవల తరచూ జరుగుతున్న విమాన ప్రమాదాలపై ఆయన స్పందిస్తూ గగనతల భద్రత చాలా అవసరమని, ఒక ఎయిర్‌క్రాఫ్ట్‌ను కోల్పోవడమంటే అది ఆర్థికంగా నష్టమే కాక, యుద్ధ సామర్థ్యాన్ని తగ్గిస్తుందని అన్నారు. దీనిపై సిబ్బంది నిరంతర నిఘా అవసరమన్నారు. మానవ తప్పిదాల వల్ల జరిగే ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని, తగిన సాంకేతిక నిపుణులు, సిబ్బందితో వారికి శిక్షణ ఇప్పిస్తున్నామని అన్నారు. అన్ని పరిస్థితులను వారు ఎదుర్కొనేలా తయారు చేస్తామన్నారు. ముఖ్యంగా సంప్రదాయంగా ఉన్న ఫైటర్స్ నుంచి ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్న వెపన్ సిస్టమ్ వరకు అన్నింటిలో పూర్తితర్ఫీదు ఇస్తామని చెప్పారు. భారతదేశ రక్షణలో ఐఏఎఫ్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని, తమకు ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోడానికి అప్రమత్తంగా ఉంటామని అన్నారు. రోజురోజుకు తమ బలాన్ని పెంచుకుంటున్నామని ఆయన చెప్పారు. 36 రాఫెల్ ఎయిర్‌క్రాఫ్ట్, ఎస్-400 మిస్సయిల్స సిస్టమ్స, అపాచి హెలికాప్టర్, చినూక్ హెవీ హెలికాప్టర్లతో భారత వాయుసేన మరింత పటిష్టంగా మారనుందన్నారు. ఇటీవల కేరళలో సంభవించిన వరదల్లో 23 విమానాలు, 25 హెలికాప్టర్ల ద్వారా ప్రజలు సేవలందించామని, ఆపదలో ఉన్న వేలాది మందిని రక్షించామని చెప్పారు. అలాగే అడవుల్లో, ఢిల్లీ లాంటి అర్బన్ ప్రాంతాల్లో జరిగే అగ్నిప్రమాదాల్లో సైతం తమ సేన సేవలందిస్తోందని ఆయన చెప్పారు. అలాగే మయన్మార్, ఇండోనేషియాలో సహాయ సామాగ్రిని అందజేసిన విషయంలో ఐఏఎఫ్ పాత్ర మరువలేనిదన్నారు. 14000 మంది అధికారులు, 14వేల మంది సిబ్బందిని చూస్తుంటే ఐఏఎఫ్ బలం ఎంతుందో తెలుస్తోందన్నారు. ఈ సందర్భంగా ఎయిర్‌ఫోర్సు సిబ్బంది ఆకాశంలో పలు విన్యాసాలు ప్రదర్శించారు.
భారత వైమానిక సామర్థ్యానికి నిలువెత్తు నిదర్శనంగా ఘజియాబాద్‌లో సోమవారం అద్భుతరీతిలో విన్యాసాలు జరిగాయ. ఇటు గగనతల పటిమను చాటుకున్న వైమానిక దళాలు తమ విన్యాసాల ద్వారా వాయుసేన శక్తిని జగతికి చాటారు. సారంగ్ హెలికాప్టర్‌ల విన్యాసాలు అబ్బురపరిస్తే.. వాయుసేన కవాతు ఈ దళంలో క్రమశిక్షణకు అద్ధం పట్టింది

చిత్రం..వాయుసేన కవాతు