జాతీయ వార్తలు

ఖడ్సేకు ఉగ్రవాదులతో సంబంధం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 18: మహారాష్ట్ర మాజీ మంత్రి ఏక్‌నాథ్ ఖడ్సే, పరారీలో ఉన్న మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం ఫోన్ల మధ్య ఎలాంటి సంభాషణలు జరగలేదని తమ ప్రాథమిక విచారణలో తేలిందని మహారాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక స్క్వాడ్ (ఎటిఎస్) సోమవారం బొంబాయి హైకోర్టుకు తెలిపింది. ఒక హ్యాకర్ ఆరోపించినట్లు ఏక్‌నాథ్ ఖడ్సేకు ఉగ్రవాదులతో ఎలాంటి సంబంధాలు లేవని తమ విచారణలో తేలిందని ఎటిఎస్ తరపు న్యాయవాది నితీన్ ప్రధాన్.. న్యాయమూర్తులు ఎన్‌హెచ్ పాటిల్, పిడి నాయక్‌తో కూడిన హైకోర్టు ధర్మాసనానికి చెప్పారు. గుజరాత్‌కు చెందిన హ్యాకర్ మనీశ్ భంగాలే దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనానికి ప్రధాన్ ఈ విషయం చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం పాక్షికంగా దర్యాప్తు జరిపిందని, అందువల్ల కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ)తో దర్యాప్తు జరిపించాలని మనీశ్ తన పిటిషన్‌లో హైకోర్టును అభ్యర్థించారు. ‘తాను సమర్పించిన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం తేలికగా తీసుకుంటోందని పిటిషనర్ చేసిన ఆరోపణ సరికాదు. మేము అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. సిబిఐ దర్యాప్తు అక్కర లేదు’ అని ప్రధాన్ హైకోర్టుకు చెప్పారు. అయితే ఖడ్సేకు ఉగ్రవాదులతో సంబంధం ఉన్నట్లు తమ విచారణలో తేలనప్పటికీ, మరికొన్ని ఇతర అంశాలు వెలుగులోకి వచ్చాయని ఆయన తెలిపారు. ఆ ఇతర అంశాలపై సిటీ పోలీస్‌కు చెందిన సైబర్ క్రైమ్ సెల్ నిపుణులు దర్యాప్తు జరపాల్సి ఉందని వివరించారు. ఎటిఎస్ ప్రాథమిక విచారణ నివేదికను పోలీస్ క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన సైబర్ క్రైమ్ సెల్‌కు సమర్పిస్తుందని ప్రధాన్ కోర్టుకు చెప్పారు. ప్రధాన్ వాంగ్మూలాన్ని నమోదు చేసిన ధర్మాసనం క్రైమ్ బ్రాంచ్ ముందు హాజరు కావలసిందిగా భంగాలేకు సూచించింది. ఎప్పుడు అవసరమైతే అప్పుడు సమాచారాన్ని క్రైమ్ బ్రాంచ్‌కు సమర్పించాల్సిందిగా ఆదేశించింది. అనంతరం ధర్మాసనం భంగాలే పిటిషన్‌పై విచారణను ముగిస్తూ, ‘మేము ప్రతిసారి నేరుగా సిబిఐ దర్యాప్తుకు ఆదేశించజాలం. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా విశ్వసించాలి. దర్యాప్తు సరిగా చేయలేదని పిటిషనర్ భావిస్తే, అప్పుడు మళ్లీ హైకోర్టును సంప్రదించవచ్చు’ అని స్పష్టం చేసింది. తన ప్రాణాలకు ముప్పుందని భంగాలే వ్యక్తం చేసిన ఆందోళనపై ధర్మాసనం స్పందిస్తూ పోలీసు కమిషనర్‌ను ఆశ్రయించవచ్చని, కమిషనర్ అతని విజ్ఞప్తిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటారని ధర్మాసనం పేర్కొంది.