జాతీయ వార్తలు

నాలుగు రాష్ట్రాలకు పవర్ (గ్రి)గడ్డు సమస్య!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, అక్టోబర్ 15: తిత్లీ తుపాను సిక్కోల్‌ను అంధకారంలోకి నెట్టేయడమే కాకుండా తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు విద్యుత్ కొరతను కూడా తెచ్చిపెట్టింది. పలాస సమీపంలో ఉద్దానం రామకృష్ణాపురం వద్ద గల పవర్ గ్రిడ్‌కు సంబంధించిన టవర్లన్నీ తుపాను ధాటికి ధ్వంసమయ్యాయి. దీంతో సాంకేతిక లోపం తలెత్తడంతోపాటు వివిధ పవర్‌ప్లాంట్లకు అనుసంధానం చేసే వ్యవస్థ కూడా పూర్తిగా దెబ్బతింది. దీంతో 3000 మెగావాట్ల విద్యుత్ సరఫరాను నియంత్రించే గ్రిడ్ మోరాయించింది. ఇదే తరహా పవర్ గ్రిడ్ విశాఖపట్నం గాజువాకలో ఉండడం వల్ల కొంత వరకూ ఆయా రాష్ట్రాల పవర్‌ప్రాజెక్టులకు అనుసంధానం ప్రక్రియ నెమ్మదిగా కొనసాగుతున్నప్పటికీ, పునరుద్ధరించేందుకు రూ. 70 కోట్లు కేంద్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేస్తేగాని, నిర్వాహణ పనులు ప్రారంభం అయ్యే పరిస్థితి లేదు. జిల్లాలో తిత్లీ తుపాను కారణంగా అతలాకుతలమైన విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణ యుద్ధప్రాతిపదికన జరుగుతున్నప్పటికీ, ఇంకా 16 మండలాలు అంధకారంలోనే ఉన్నాయి. తిత్లీ వల్ల ఒక్క శ్రీకాకుళం జిల్లాపైనే విద్యుత్ రంగం పెద్ద సవాళ్ళు ఎదుర్కొంటోందని అనుకుంటే తప్పే. పలాస మండలం సమీపంలో రామకృష్ణాపురం వద్ద కేంద్ర ప్రభుత్వం నిర్మించే పవర్ గ్రిడ్‌ను తిత్లీ తుపాను పూర్తిగా ధ్వంసం చేసింది. దీని వల్ల ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు విద్యుత్ అంతరాయం కలిగింది. 220 కె.వి. 130 కె.వి. 33 కె.వి. ఎల్.టి.సబ్‌స్టేషన్లు బాగా పాడైపోగా, జిల్లా అంతటా 35 వేల స్తంభాలు నేలకొరిగాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మండల కేంద్రాలకు తక్షణం విద్యుత్ పునరుద్ధరణ జరగాలని ఆదేశించినప్పటికీ, వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు అనుకూలంగా లేకపోవడంతో ఇప్పటికీ విద్యుత్ సరఫరా ఇంకా మండల కేంద్రాలకు ఇవ్వలేకపోయారు. వజ్రపుకొత్తూరు, మెళియాపుట్టి మండలాలకు మరో నాలుగు రోజుల వరకూ విద్యుత్ సరఫరా చేసేందుకు అవకాశం లేదంటూ సంబంధిత శాఖాధికారులు స్పష్టంగా చెప్పేస్తున్నారు. ఆయా గ్రామాల్లో జనరేటర్లు ద్వారా విద్యుత్ అందించాలంటూ సీఎం ఆదేశాలు అమలు చేసేందుకు అధికారులు అవస్థలు పడుతున్నారు. 13 జిల్లాల నుంచి ఏడు వేల మంది సిబ్బంది పనిచేస్తున్నప్పటికీ విద్యుత్ అంతరాయం ఇంకా ఉంది. నాలుగేళ్ళ క్రితం హుదూద్ తుపాను వల్ల మూడు జిల్లాల్లో 80 వేల స్తంభాలు నెలకొరిగాయని, తిత్లీ తుపాను ఒక్క శ్రీకాకుళం జిల్లాలో ఏడు మండలాల్లోనే 30 స్తంబాలు కుప్పకూలిపోవడంతో విద్యుత్ వ్యవస్థ ధ్వంసమైంది. ఇటువంటి విపత్తులను ఎదుర్కొనేందుకు విద్యుత్‌శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్ ప్రత్యేక కార్యాచరణ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. స్పన్ స్తంభాలు వేసేలా సూచించారు. ఎల్టీ స్తంభాల కంటే స్పన్ స్తంభాలు ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని నిలబడతాయని, భూగర్భ విద్యుత్ వ్యవస్థ ఖరీదు బాగా ఎక్కువకావడంతో స్పన్ పోల్ విధానాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. ఈ సందర్భంగానే తిత్లీ తుపాను ధ్వంసం చేసే విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించే పనుల్లో సరికొత్తగా స్పన్ పోల్స్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. ఒక స్పన్ స్తంభం ఖరీదు రూ. 12 వేలు. ఇప్పటి వరకూ వాడుతున్న ఎల్టీ స్తంభం ఖరీదు కేవలం మూడు వేల రూపాయలే. ప్రస్తుతం ఈ సరికొత్త వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు మూడు వందల కోట్ల రూపాయలు అవసరం కానుంది. తిత్లీ తుపాను వల్ల జిల్లాలో విద్యుత్ రంగానికి రూ. 505 కోట్లు నష్టం వాటిల్లింది. డిస్కమ్‌కు రూ. 300 కోట్లు, ట్రాన్స్‌కోకు రూ. 100 కోట్లు, ఇతర నష్టాలు మరో రూ. 100 కోట్లు జరిగిందని అజైయ్‌జైన్ గతంలో వెల్లడించిన వివరాలు పక్కన పెడితే కేంద్ర ప్రభుత్వం సంస్థ పవర్ గ్రిడ్‌కు రూ. 70 కోట్లు వాటిల్లింది. ఇటువంటి ఆర్థిక అవస్థల పరిస్థితుల్లో శ్రీకాకుళంలో విద్యుత్ వ్యవస్థ విపత్తులను తట్టుకునే విధంగా స్పల్ పోల్స్ విధానానికి ముఖ్యమంత్రి అంగీకరించడం సిక్కోల్ కష్టకాలాని మంచిరోజులు వచ్చినట్టే!!
పింక్ కార్డుకు అందని సాయం
తుపాను ప్రభావిత ప్రాంతాలైన పలాస, వజ్రపుకొత్తూరు, కంచిలి, కవిటి, సోంపేట, ఇచ్చాపురం, టెక్కలి, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి తదితర మండలాల్లో సహాయక చర్యలు అందించేందుకు ప్రభుత్వం తెలుపు రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోవడంతో పింక్ రేషన్ కార్డుదారులకు నిస్సాయతతో ఆందోళనకు దిగుతున్నారు. ఇల్లు, పంటలు కోల్పోయిన కుటుంబాలు ప్రభుత్వ సాయం కోసం సోమవారం అక్కడ అధికారులకు కలిసి మొరపెట్టుకుంటే తెల్లకార్డు ఉంటేనే సాయం ఇవ్వగలమంటూ సుస్పష్టం చేయడంతో బాధితులు టెక్కలి డివిజన్‌లో వాగ్వివాదానికి దిగి, అధికారులను నిలదీస్తున్నారు. ఆకలికేకల మధ్య అలమటిస్తున్న తుపాను బాధితులను తిత్లీ తెల్లకార్డులు, పింకు కార్డులంటూ వేరుచేసి ధ్వంసం చేయలేదంటూ మహిళలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చిత్రం... ..రామకృష్ణాపురం వద్ద జరుగుతున్న పవర్‌గ్రిడ్ పనులు