జాతీయ వార్తలు

కోహినూర్‌ను ‘సరెండర్’ చేశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రపంచ ప్రఖ్యాత కోహినూర్ వజ్రానికి సంబంధించి మరో ఆసక్తికర విషయం వెలుగు చూసింది. 108 క్యారెట్ల ఈ అపురూప వజ్రాన్ని 170 సంవత్సరాల క్రితం అప్పటి లాహోర్ మహారాజు ఇంగ్లాండ్ రాణికి ‘‘సరండర్’’ చేశారని భారత పురావస్తు శాఖ వెల్లడించింది. ఈ వజ్రాన్ని బ్రిటిష్ పాలకులకు ఇవ్వలేదని సమాచార హక్కు పిటీషన్‌దారుకు స్పష్టంచేసింది. లూథియానకు చెందిన ఆర్టీఐ కార్యకర్త రోహిత్ సబర్వాల్ దాఖలు చేసిన పిటీషన్‌కు
సమాధానంగా ఎఎస్‌ఐ ఈ వివరాలు అందించింది. 200 మిలియన్ డాలర్ల విలువచేసే ఈ వజ్రాన్ని నాటి బ్రిటిష్ పాలకులకు బహుమతిగా ఇచ్చారా లేక మరో కారణంగా దీన్ని వారికి స్వాధీన పరచారా? అని ప్రశ్నిస్తూ ఈ కార్యకర్త వివరాలు కోరాడు. దీనికి సమాధానంగా ఏఎస్‌ఐ వెల్లడించిన వివరాలకు, 2016లో సుప్రీంకోర్టు కేంద్రం ఇచ్చిన సమాచారానికి ఏరకంగానూ పొంతన లేదు. అప్పట్లో సుప్రీంకు వివరాలు అందించిన కేంద్ర ప్రభుత్వం కోహినూర్ వజ్రాన్ని బ్రిటిష్ పాలకులు దొంగిలించలేదని, అలాగే బలవంతంగానూ తీసుకెళ్లలేదని స్పష్టం చేసింది. ఆ వజ్రాన్ని అప్పటి పంజాబ్ పాలకులు ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇచ్చారని తెలిపింది. ఢిల్లీలోని జాతీయ పురావస్తు విభాగంలో పొందుపరిచిన వివరాల ప్రకారం ఇందుకు సంబంధించిన వాస్తవాలు ఇలా ఉన్నాయి. 1889లో లార్డ్ డెల్‌హౌసీకి మహారాజ దులీప్‌సింగ్‌కు మధ్య లాహోర్ ఒప్పందం కుదిరింది. అందులో భాగంగా ఇంగ్లాండ్ రాణికి కోహినూర్ వజ్రాన్ని దులీప్‌సింగ్ ‘స్వాధీనపరిచారు’. 14వ శతాబ్దానికి చెందిన ఈ వజ్రం వలస పాలకుల కాలంలో ఆంగ్లేయుల చేతికి చిక్కింది. ఈ వజ్రం తమదేనంటూ భారత సహా నాలుగు దేశాలు దశాబ్దాలుగా వాదనలు వినిపిస్తూనే వున్నాయి. తాను ఇటీవల లండన్ వెళ్లి ఓ మ్యూజియాన్ని సందర్శించానని, అక్కడ తనకు కోహినూర్ వజ్రం కనిపించిందని ఆర్టీఐ కార్యకర్త శబర్వాల్ తెలిపారు. అయితే వజ్రం తమకు బహుమతిగా వచ్చిందని అక్కడి వర్గాలు తనకు తెలిపాయని పేర్కొన్న ఆయన స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత వాస్తవాలు కోరుతూ సమాచార హక్కు చట్టం కింద పిటీషన్ దాఖలు చేశారు. దీనికి ఏఎస్‌ఐ ఇచ్చిన సమాధానం 2016లో సుప్రీంకోర్టుకు కేంద్రం ఇచ్చిన వివరాలకు పూర్తి భిన్నంగా ఉందని వెల్లడించారు.