జాతీయ వార్తలు

మీటూ దెబ్బకు ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు ఫిరోజ్‌ఖాన్ అవుట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 16: దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్న ‘మీటూ’ సెగలు కాంగ్రెస్ పార్టీని కూడా తాకాయి. కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎస్‌యూఐ) జాతీయ అధ్యక్షుడు ఫిరోజ్‌ఖాన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలతో ఆయన పదవి నుంచి తప్పుకున్నారు. ఈ ఆరోపణలతో ఫిరోజ్‌ఖాన్ సోమవారం రాజీనామా చేయగా, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మంగళవారం ఆమోదించారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే ఇలాంటి ఆరోపణలు పార్టీ ప్రతిష్టకు భంగంకలిగించే విధంగా ఉన్నందున తమ పదవికి ఫిరోజ్‌ఖాన్ రాజీనామా చేశారని ఎన్‌ఎస్‌యూఐ జాతీయ కార్యదర్శి సైమన్ ఫరూకీ వెల్లడించారు. జమ్ము కశ్మీర్‌కు చెందిన ఫిరోజ్‌ఖాన్ తనను లైంగికంగా వేధింపులకు గురిచేశాడని ఛత్తీస్‌ఘడ్ చెందిన ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్త ఆరోపించింది. ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థి విభాగం నియామకాల సమయంలో తనను ఫిరోజ్‌ఖాన్ లైంగికంగా వేధించాడని ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌లో(జూన్ నెలలో) ఆ కార్యకర్త ఫిర్యాదు చేసింది. ఫిరోజ్‌ఖాన్ నుంచి తనకు ప్రాణ హాని ఉందని కూడా ఆ విద్యార్థి ఆరోపించారు. ఫిరోజ్‌ఖాన్‌పై చర్యలు తీసుకోవాలని రాహుల్‌గాంధీతో పాటు కాంగ్రెస్ నాయకులకు ఆమె ఫిర్యాదు చేసింది. ఈ ఆరోపణలపై నిజనిర్థారణ చేసేందుకుగాను కాంగ్రెస్ పార్టీ ముగ్గురు సభ్యులతో కూడిన ఒక కమిటీ ఏర్పాటు చేసింది. అప్పట్లో ఫిరోజ్‌ఖాన్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. దేశంలో మహిళలు ‘మీటూ’ పేరుతో చేస్తున్న ఆరోపణలు తీవ్ర సంచలనాలకు దారితీస్తున్న విషయం తెలిసిందే. కేంద్రం మంత్రి ఎంజే అక్బర్‌పై వచ్చిన ఆరోపణలకు ఆయన రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. మీటూ ఉద్యమానికి తన పూర్తి మద్దతు ఉంటుందని రాహుల్ గాంధీ ప్రకటించిన తరువాత ఈ రాజీనామా చేయాలని ఫిరోజ్‌ఖాన్‌కు పార్టీ అధినాయకత్వం సూచించడంతో చివరకు ఆయన రాజీనామా చేయక తప్పలేదు.