జాతీయ వార్తలు

విదేశీల్లో భారతీయుల అక్రమాస్తులపై ఐటీ శాఖ డేగకన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 22: భారతీయులు అక్రమంగా ఆర్జించిన విదేశీ నిధులు, తద్వారా కూడపెట్టిన ఆస్తులపై ఆదాయపన్ను విభాగం అధికారులు ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారు. వీటిపై లోతైన విచారణ చేపట్టి నిగ్గుదేల్చేందుకు అతిపెద్ద ఆపరేషన్‌కు సోమవారం శ్రీకారం చుట్టారు. ఇందుకు సంబంధించి కఠినతర క్రిమినల్ చర్యలు చేపట్టేందుకు వీలుగా సరికొత్త నల్లధన నిరోధక చట్టాన్ని సైతం ప్రయోగించాలని నిర్ణయించారు. విదేశాల్లోని ఆదాయపన్ను శాఖ అదికారులతో సమన్వయంగా పనిచేస్తూ అక్కడ నివసిస్తున్న వేలాది మంది భారతీయుల బ్యాంక్ ఖాతాలు, డిపాజిట్లుతోబాటు కొనుగోలు చేసిన ఆస్తులపై సైతం సమగ్ర తనిఖీలు, విచారణ జరపాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని సీబీడీటీ చైర్మన్ సుశీల్ చంద్ర సైతం ధ్రువీకరించారు. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను అందించేందుకు ఆయన నిరాకరించారు. ఈ దిశలో అనేక విదేశీ లావాదేవీలకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఇప్పటికే భారత ఆదాయపన్ను శాఖ అధికారులు ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్‌ఐయూ) నుంచి సేకరించినట్లు తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా జరిగిన ఈ రకమైన లావాదేవీల కారణంగా దేశంలోకి నల్లధన ప్రవాహం వెల్లువెత్తినట్లు అనుమానిస్తున్నారు. ఇప్పటికే చాలామందికి ఈ రకమైన లావాదేవీలపై వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసులు సైతం జారీ చేయడం జరిగిందని అధికారులు చెప్పారు, ఇందులో అనేకమంది అత్యున్నత పదువుల్లోవున్న, సంఘంలో అత్యున్నత స్థాయి గౌరవమర్యాదలు పొందుతున్న వ్యక్తులు కూడా వున్నారని స్పష్టమైంది. వీరు దోషులని తేలితే కొత్త నల్లధన వ్యతిరేక చట్టం ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నారు.
సరైన ఆదాయపన్ను రిటర్న్స్ సమర్పించిన వారిపై ఎలాంటి చర్యలూ ఉండబోవని, కావాలని ఈ విషయంలో గోప్యతని అవలంభించినట్లు తేలితే కఠిన చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. విదేశీ సొమ్ము రాబడిని వెల్లడించడంతోబాటు, ఆ రాబడితో కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలు ఖచ్చితంగా వెల్లడించేలా కేంద్ర ప్రభుత్వం నల్లధన నిరోధక చట్టాన్ని కొత్తగా తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం వెల్లడించని విదేశీ ఆదాయం, ఆస్తులపై 120 శాతం పన్నులు, పెనాల్టీ విధించడంతోబాటు పదేళ్లకు తక్కువ కాకుండా జైలు శిక్ష వేసే వీలుకలిగింది.