జాతీయ వార్తలు

ప్లెబిసైట్ ప్రసక్తే లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 18: కాశ్మీర్ అల్లర్లకు ఆజ్యం పోస్తున్నది పాకిస్తానేనని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పొరుగున ఉన్న పాకిస్తాన్ బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని, ముస్లింలను రక్షించేది తామేనని చెప్పుకునే అర్హత దానికెంత మాత్రం లేదని సోమవారం రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా అన్నారు. ‘గత కొన్ని రోజులుగా కాశ్మీర్‌లో జరుగుతున్న అల్లర్ల వెనుక పాకిస్తాన్ పాత్ర, ప్రమేయం ఉన్నాయి. దాని ప్రోత్సాహం, ప్రోద్బలంతోనే అక్కడ అల్లర్లు జరుగుతున్నాయి’అని రాజ్‌నాథ్ నిప్పులు చెరిగారు. ‘పేరుకే దాని పేరు పాకిస్తాన్ (పవిత్రత) కానీ అది చేసే పనులన్నీ నాపాక్ (అపవిత్రమైనవే)’నని పేర్కొన్నారు.కాశ్మీర్‌పై ప్రజాభిప్రాయ సేకరణ ప్రసక్తే లేదని, ఆ డిమాండ్‌కు కాలంచెల్లిందని ఉద్ఘాటించారు. కాశ్మీరీలు భారత దేశ సొంత పౌరులని, వారిని తప్పుదోవ పట్టిస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాశ్మీర్ పరిస్థితిని ఎదుర్కొనే విషయంలో అన్ని పార్టీలనూ కలుపుకుని ముందుకెళతామన్నారు. తీవ్రవాదాన్ని అణచివేసే విషయంలో ఎలాంటి రాజీ లేదని, అయితే వీధుల్లోకి వచ్చి అలజడి సృష్టించే మూకలను చెదరగొట్టేందుకు బాష్పవాయు గోళాలు, లాఠీలనే తొలి ప్రయత్నంగా ప్రయోగించాలని అన్నారు. అలాగే నాటు తూటాలను వాడటం ద్వారా అనేక మంది గాయపడుతున్నారన్న ఆరోపణలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. ఇందుకు సంబంధించి కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబాతో మాట్లాడతానని రాజ్‌నాథ్ వెల్లడించారు. హింసాకాండకు పాల్పడే అల్లరి మూకల్ని ఎదుర్కొనే విషయంలో పూర్తి స్థాయిలో సంయమనాన్ని పాటించాలని తనతో పాటు ప్రధాని మోదీ కూడా భద్రతాదళాలను కోరారన్నారు. ప్రజలతో నేరుగానే మాట్లాడేందుకు తాను కాశ్మీర్ వెళ్లాలని భావించానని, అయితే పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత తానే స్వయంగా ఢిల్లీ వస్తానని ముఖ్యమంత్రి మెహబూబా చెప్పారని రాజ్‌నాథ్ వెల్లడించారు. ఈ చర్చ సందర్భంగా మాట్లాడిన ప్రతిపక్ష పార్టీల నేతలు ఎన్డీయే సర్కార్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.కాశ్మీర్ సమస్యను బులెట్లతో కాకుండా రాజకీయంగా పరిష్కరించే ప్రయత్నం చేయాలని డిమాండ్ చేశారు.ఇందులో భాగంగా అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ముక్తకంఠంతో విజ్ఞప్తి చేశారు.

చిత్రం.. రాజ్యసభలో మాట్లాడుతున్న హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్