జాతీయ వార్తలు

మిజోరంలో ఐఏఎస్‌పై వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐజ్వాల్, నవంబర్ 5: ఎన్నికలు జరుగుతున్న మిజోరంలో ఉన్నతాధికారుల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. ఏకంగా ఓ సీనియర్ ఐఏఎస్ అధికారిపైనే వేటుపడింది. తమ మనోభావాలను దెబ్బతీసిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) ఎస్‌బీ శశాంక్‌ను తొలంగించాలని అఖిలభారత సర్వీసు అధికారులు, పౌర, విద్యార్థి సంఘాలు డిమాండ్ చినికిచినికి గాలివానగా మారింది. సీఈవో శశాంక్ మాత్రం తనపై వచ్చిన ఆరోపణలు కొట్టిపారేశారు.‘నేను ఎవరి సెంటిమెంట్లను అవమానించలేదు. నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నా’అని సోమవారం ఆయన ప్రకటించారు. సీఈవోను తప్పించాలని ఓ పక్క డిమాండ్ చేస్తుండగానే ప్రధాన కార్యదర్శి స్థాయి రాష్ట్ర అధికారి లాన్‌ఉన్‌మావియా ఛౌంగూపై కేంద్ర ఎన్నికల సంఘం వేటువేసింది. శశాంక్ ఫిర్యాదుమేరకే ఈసీ ఛౌంగూపై కఠిన చర్య తీసుకుందని మీడియాలో ఓ వర్గం స్పష్టం చేసింది. 40 స్థానాలున్న మిజోరం అసెంబ్లీకి ఈ నెల 28న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో విభేదాలు తారస్థాయికి చేరాయ.