జాతీయ వార్తలు

దిగివచ్చిన సర్కార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనేశ్వర్, నవంబర్ 5: రైతుల ఆందోళనతో ఒడిశాప్రభుత్వం దిగివచ్చింది. వారి డిమాండ్లను పరిష్కరించేందుకు మంత్రివర్గ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. రైతులు చేపట్టిన పాదయాత్ర సోమవారం రాష్ట్ర రాజధానిని సమీస్తున్న క్రమంలో ప్రభుత్వం స్పందించడం గమనార్హం. మంత్రివర్గ కమిటీకి ఆర్థిక మంత్రి ఎస్‌బీ బెహ్రా నేతృత్వం వహిస్తారని, పంచాయతీ రాజ్, సహకార శాఖల మంత్రులు ఈ కమిటీ సభ్యులుగా ఉంటారని, సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని, ప్రభుత్వంపై విశ్వాసం ఉంచి తిరిగి గ్రామాలకు వెళ్లాలని ప్రభుత్వం ఆందోళనకారులకు విజ్ఞప్తి చేసింది. వ్యవసాయాభివృద్ధికి, రైతుల ప్రగతికి ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించి అములు చేస్తున్న రాష్ట్రాల్లో ఒడిశా కూడా ఒకటని మంత్రి బెహ్రా అన్నారు. కేవలం ఒక శాతం వడ్డీరేటుతో రైతులకు రుణాలను ఇస్తున్నామని, అలాగే పదేళ్లలో గణనీయమైన ప్రగతి సాధించామని అన్నారు. ఇలావుండగా నబా నిర్మాణ్ కృషిక్ సంఘటన్ (ఎన్‌ఎన్‌కేఎస్) నేతృత్వంలో రైతులు ఈ ఆందోళన చేపట్టి పాదయాత్రగా భువనేశ్వర్‌కు తరలిరాగా రెండు ప్రవేశ కేంద్రావద్ద మోహరించిన పోలీసులు రైతులను అడ్టుకున్నారు. అక్కడే బైఠాయించిన ఆందోళనకారులను ఉద్దేశించి ఎన్‌ఎన్‌కేఎస్ కన్వీనర్ అక్షయ్‌కుమార్ మాట్లాడుతూ తమను ప్రభుత్వం అరెస్టు చేసినా సరే ఇక్కడి నుంచి కదిలేదని భీష్మించారు. వ్యవసాయోత్పత్తులకు మద్దతు ధర, రైతులందరికీ పింఛన్లు ప్రధాన డిమాండ్లుగా ఆయన చెప్పారు.