జాతీయ వార్తలు

కాంగ్రెస్‌కు షాక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐజ్వాల్, నవంబర్ 5: మిజోరం అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు పెద్ద షాక్ తగిలింది. అసెంబ్లీ స్పీకర్ హైఫీ సోమవారం పదవికి, పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు. రాష్ట్రంలో స్వయం ప్రతిపత్తితో కూడిన జిల్లాల ఏర్పాటుకు బీజేపీ అధినాయకత్వం హామీ ఇవ్వడంతో ఆయనీ నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌ను సవరిస్తామని హోమ్ మంత్రి రాజ్‌నాథ్ నుంచి హైఫీకి స్పష్టమైన భరోసా ఇచ్చారు. హైఫీ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. స్వయంప్రతిపత్తితో కూడిన జిల్లాలు ఏర్పడితే అభివృద్ధికి నిధులు వస్తాయని ఆయన తెలిపారు. మిజోరంలో బీజేపీ నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఘోర పరాజయం తప్పదని ఆయన అన్నారు. 40 స్థానాలున్న అసెంబ్లీలో బీజేపీకి మంచి సీట్లే లభిస్తాన్న ధీమా హైఫీ వ్యక్తం చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఒక్క మిజోరంలోనే కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఉదయం డిప్యూటీ స్పీకర్‌ను కలిసి రాజీనామా పత్రం అందజేశానని, ఆమోదించారని హైఫీ స్పష్టం చేశారు. తరువాత కాంగ్రెస్ భవన్‌కు వెళ్లి పార్టీ ప్రాధమిక సభ్యత్వానికీ రాజీనామా చేశారు. ఎన్నికలో బీజేపీ టికెట్‌పై పాలాక్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ఆయన తెలిపారు. అలాగే ప్రధాని మోదీ ఈనెల 18న మిజోరంలో ఎన్నికల ప్రచారం చేస్తారని ఆయన చెప్పారు. హైఫీ సీనియర్ నాయకుడని, బీజేపీలో చేరడం వల్ల పార్టీ బలోపేతం అవుతుందని ఈశాన్య రాష్ట్ర ప్రజాసంఘటన కన్వీనర్, బీజేపీ నేత హిమంత బిస్వా శర్మ పేర్కొన్నారు. హైఫీ రాష్ట్రంలోనే అత్యంత సీనియర్ నేత. 1972 నుంచి 89 వరకూ ఆరు పర్యాయాలు తీపాంగ్ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2013లో మాత్రం పాలాక్ నుంచి గెలిచారు. ఇలావుంటే, హైఫీ రాజీనామా కాంగ్రెస్‌లో అలజడి రేపింది. బీజేపీ నుంచి ఎదురయ్యే గట్టి పోటీని తట్టుకోవడానికి సన్నాహాలు చేస్తున్న కాంగ్రెస్ ఈ పరిణామంతో కంగుతిన్నది. అయతే, హైఫీ రాజీనామా వల్ల ఎలాంటి సమస్య లేదని బింకాలు పోతున్నది.