జాతీయ వార్తలు

ఉద్దండులపైనే బీజేపీ గురి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 5: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావడానికి బీజేపీ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. కాంగ్రెస్‌కు బలంగా ఉన్న స్థానాల్లో పట్టుసాధించేందుకు అధికార పార్టీ పావులు కదుపుతోంది. సీనియర్ నేత కమల్‌నాథ్, జ్యోతిరాదిత్య సింధియాకు బలమైన నియోజకవర్గాలైన ఛింద్వారా, గుణ, శివ్‌పురి, గ్వాలియర్‌లను కొల్లగొట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. దీని కోసం ఆర్‌ఎస్‌ఎస్ కేడర్, బూత్ కమిటీలను సన్నద్ధం చేస్తోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ కాంగ్రెస్ శిబిరంలో పాగా వేయాలని అధికార పార్టీ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ఇటీవల ఛింద్వారా నియోజకవర్గంలో జరిపిన యాత్ర విజయవంతం కావడంతో బీజేపీలో ఉత్సాహం వెల్లివిరిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలను గెలుకుంటామన్న ధీమా కమలనాథుల్లో వ్యక్తమవుతోంది. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ బీజేపీ విజయం గెలిచింది. అయితే ఈసారి పరిస్థితులు అంత అనుకూలంగా సర్వేలు తెలిపాయి. చౌదరీ చంద్రభాన్ సింగ్ గట్టిపోటీనే ఎదుర్కొంటున్నారు. ‘కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. దీంతో ఛింద్వారాపై ఆయన దృష్టిపెట్టడం కుదరదు. రాష్ట్ర మంతటా తిరిగి ఆయన ప్రచారం చేయాలి కాబట్టి, మాకే ఎక్కువ అవకాశాలుంటాయి’అని బీజేపీ సీనియర్ నేత ఒకరు వెల్లడించారు. అయితే గ్వాలియర్‌పై బీజేపీ ధీమాగా ఉన్నప్పటికీ గుణ, శివ్‌పురి ప్రాంతాలు బీజేపీకి అనుకూలంగా లేనట్టు సర్వేలు చెబుతున్నాయి. ఆ ప్రాంతంలో సింధియాలకు మంచి పట్టుంది. జ్యోతిరాదిత్య బంధువు, మంత్రి యశోధర రాజే తప్ప మిగతా బీజేపీ అభ్యర్థులు అంత బలంగా లేరని తెలిసింది. ఇక ఆ ప్రాంతంలో పార్టీ ప్రచార బాధ్యతలు కేంద్ర మంత్రి నరేంద్ర సింగ తోమర్‌కు అప్పగించారు. గుణ-శివ్‌పురి-గ్వాలియర్‌లో ప్రచారానికి సీనియర్ రానున్నారు. ఓబీసీ, దళిత నాయకులను బీజేపీ ప్రచార గోదాలో దింపుతోంది. ‘ప్రధాని నరేంద్రమోదీ, సీఎం చౌహాన్ ఎన్నికల ప్రచారం చేస్తారు’అని ఆయన ప్రకటించారు. కాంగ్రెస్‌లో ఓట్లు చీలిపోయి తమకే పడతాయన్న ధీమా బీజేపీ నేతల్లో ఉంది. మరోపక్క టికెట్ల కేటాయింపులోనూ సామాజిక అంశాలను బీజేపీ పరిగణనలోకి తీసుకుంది. అలాగే ఓబీసీ, బ్రాహ్మిణ్ (బుందేల్‌ఖండ్ ప్రాంతం)లకు టికెట్లు ఇచ్చింది. బీజేపీ జాబితాలో రాజ్‌పుట్ అభ్యర్థులకు ప్రాధాన్యత కల్పించారు.

చిత్రాలు.. శివరాజ్ సింగ్ చౌహాన్ *కమల్‌నాథ్ *జ్యోతిరాదిత్య సింధియా