జాతీయ వార్తలు

నేను అందరివాడ్ని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయ్‌పూర్, నవంబర్ 5: ఇప్పటి వరకూ కాంగ్రెస్, బీజేపీల మధ్యే ప్రధాన పోటీగా సాగిన చత్తీస్‌గఢ్‌లో ఇప్పుడు త్రిముఖ పోటీ అనివార్యమైంది. పదిహేనేళ్లుగా రాష్ట్రంలో అప్రతిహత రీతిలో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న రమణ్ సింగ్ నాలుగోసారి బరిలోకి దిగారు. నిన్న మొన్నటి వరకూ కాంగ్రెస్‌లోనే ఉన్న అజిత్ జోగి ఇప్పుడు జనతా కాంగ్రెస్ చత్తీస్‌గఢ్ పేరుతో కొత్త పార్టీ పెట్టడం వల్ల త్రిముఖ పోటీ అనివార్యమైందన్నారు. దీని వల్ల అధికార బీజేపీ కంటే కూడా కాంగ్రెస్‌కే ఎక్కువ నష్టం వాటిల్లే అవకాశం ఉంటుందని చెప్పిన రమణ్ సింగ్..మిగతా రాష్ట్రాల మాదిరిగా చత్తీస్‌గఢ్‌లో కుల ప్రభావం లేదని, తాను అందరివాడిగానే కొనసాగుతూ అందరి మన్ననలు పొందుతున్నానని తెలిపారు. రాష్ట్ర జనాభాలో తన కులమైన ఠాకూర్లు కేవలం 0.5శాతం మాత్రమే ఉన్నారని కాని తాను మాత్రం కులాలతో పట్టింపు లేకుండా అందరి క్షేమం, సంక్షేమం కోసమే పనిచేస్తూ వస్తున్నానన్నారు. రాష్ట్రంలో 32శాతం మంది గిరిజనులు, 12శాతం మంది ఎస్‌స్సీలు, ఇతర వెనుకబడిన కులాల జనాభా 48శాతం ఉందని లెక్కలు చెప్పిన రమణ్ సింగ్ సంస్థాగతంగా గట్టి పునాదులు కలిగి ఉండటమే బీజేపీకి ఉన్న తిరుగులేని బలమన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ విస్తరించిందని, ఎవరితో పొత్తు ఊసులేకుండానే ఎన్నికల్లో తమ బలాన్ని పరీక్షించుకుంటూ వచ్చిందని తెలిపారు. అయితే చిన్న పార్టీలు ఎన్ని ఉన్నా జాతీయ పార్టీలను ఎదుర్కోవడం చాలా కష్టమని, పైగా ఈ చిన్న పార్టీలకు వెయ్యి ఓట్లు సంపాదించే అభ్యర్థులే దొరకరని అజిత్ జోగి పార్టీకి రమణ్ సింగ్ పరోక్షంగా చురకవేశారు. గత అసెంబ్లీ ఎన్నిల్లో 49సీట్లు గెలుచుకున్న బీజేపీ ఈ సారి కూడా ఘన విజయం సాధిస్తుందన్న ధీమాను వ్యక్తం చేశారు. వ్యవసాయం, ప్రజాపంపిణీ వ్యవస్థను మెరుగుపరచడం సహా తన ప్రభుత్వం చేపట్టిన అనేక పథకాల వల్ల రాష్ట్రంలో ప్రభుత్వ అనుకూల రాజకీయ వాతావరణం ఉందన్నారు. బస్తర్‌లో నక్సలిజం తీవ్రత ఉందని అంగీకరించిన రమణ్ సింగ్ మళ్లీ అధికారంలోకి వస్తే ఈ ప్రాంతంలో సుస్థిర శాంతి స్థాపనే ప్రాధాన్యంగా పనిచేస్తానని తెలిపారు.