జాతీయ వార్తలు

అయోధ్యలో రామమందిరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, నవంబర్ 5: అయోధ్యలో అద్భుతమైన రామమందిరం నిర్మించనున్నట్టు ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ వౌర్య స్పష్టం చేశారు. రామజన్మభూమి- బాబ్రీ మసీదు స్థల వివాదంపై సుప్రీం కోర్టు సానుకూల తీర్పు వస్తుందన్న ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు. అయోధ్యలో రామాలయం నిర్మించేందుకు అవసరమైతే మరోసారి ఉద్యమం చేపడతామని ఆర్‌ఎస్‌ఎస్ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే.‘ తీర్పు సంగతి ఎలా ఉన్నప్పటికీ అయోధ్యలో అద్భుతమైన రామాలయం రానుంది. దాని కోసం యావత్ భారతీయులు ఎదురుచూస్తున్నారు’అని వౌర్య పేర్కొన్నారు. మొఘల్ రాజు బాబర్ పేరుతో ఒక్క రాయి కూడా ఏర్పాటు కాదు, ఈ విషయం తాను కచ్చితంగా చెబుతాను అని ఆయన అన్నారు. 16వ శతాబ్దం నాటి బాబ్రీ మసీదు 1992 డిసెంబర్‌లో ధ్వంసమైంది. హిందూ కరసేవకులు మసీదునుపై దాడి చేసి ధ్వంసం చేశారు. బాబ్రీ మసీదు ఉన్న స్థలం రాముడి జన్మస్థలంగా హిందువులు భావిస్తారు. సరయి నది పక్కన 151 మీటర్ల రాముని విగ్రహం ఏర్పాటు చేస్తామని అయోధ్య మేయర్ రిషికేశ్ ఉపాధ్యాయ గత వారం వెల్లడించారు. దీపావళి సందర్భంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దీనిపై ప్రకటన చేస్తారని మేయర్ తెలిపారు. కాగా రామ మందిర నిర్మాణ ఉద్యమానికి, రాముని విగ్రహం ఏర్పాటుకు సంబంధం లేదని వౌర్య చెప్పారు. ఈ రెండూ వేరువేరు అంశాలని ఆయన వివరించారు. ‘అయోధ్యను అభివృద్ధి చేయాలన్నది మా లక్ష్యం. ప్రతి రామ భక్తుడూ ఇదే కోరుకుంటున్నారు. 15 ఏళ్లుగా అక్కడ ఎలాంటి అభివృద్దీ జరగలేదు. మేం అధికాంలోకి వచ్చాకే అభివృద్ధి జరుగుతోంది’అని ఆయన పేర్కొన్నారు.

చిత్రం..ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ వౌర్య