జాతీయ వార్తలు

పడగవిప్పిన కాలుష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 5: దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం భయపెడుతోంది. సోమవారం నగరాన్ని కాలుష్య మేఘాలు కమ్మేశాయి. ఇలాంటి పరిస్థితి రావడం వారం రోజుల్లోనే ఇది రెండోసారి. దీపావళిని ఊహించుకుని నగర పౌరుల భయాందోళనకు గురవుతున్నారు. పండగ రెండ్రోజుల ముందే వాతావరణ ఇలా ఉంటే ఏడో తేదీన తరువాత పరిస్థితి ఏమిటన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. పొరుగురాష్ట్రాల్లో మండిస్తున్న వ్యర్థాలు ఢిల్లీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సోమవారం ఒక్కరోజే వాయుకాలుష్యం తీవ్రత అధికంగా నమోదైంది. పక్క రాష్ట్రాల నుంచి వ్యాపిస్తున్న కాలుష్యానికి దీపావళి బాణ సంచా తోడైతే పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మూడు వారాల తరువాత ఢిల్లీ వాసులు కాస్త స్వచ్ఛమైన గాలి లభించిందని కేంద్ర కాలుష్య నియంత్రణా బోర్డు స్పష్టం చేసింది. అంతే మార్నాడు యథాతధ పరిస్థితికి వచ్చేసింది. ఈ సీజనల్‌లో అక్టోబర్ 30న వాయుకాలుష్యం తీవ్ర రూపం దాల్చింది. పీఎం 2.5,పీఎం 10గా నమోదైందని బోర్డు వెల్లడించింది. పక్క రాష్ట్రాల నుంచి దుమ్ము, దూళి, పొగ రూపంలో కాలుష్య వస్తోందని నిపుణలు తెలిపారు. గాలులు ఉద్ధృతం వల్ల కాలుష్యం బెడద ఎక్కువైందని, పీఎం 2.5 కంటే అధికంగా నమోదవుతోందని వాతావరణ శాఖ పేర్కొంది. కాలుష్య స్థాయిలను తగ్గించేందుకు ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు తీసుకుంది. క్లీన్ ఎయిర్ కాంపెయిన్ పేరుతో ఈనెల 1 నుంచి ఢిల్లీ ప్రభుత్వం ఓ కార్యక్రమాన్ని చేపట్టింది. నిర్మాణ కార్యక్రమాలు ఆపడం, వాహనాల రాకపోకలను క్రమబద్ధం చేయడం వంటి కఠిన నిర్ణయాలే తీసుకుంది. దేశ రాజధాని ఢిల్లీ, పరిసరాల్లో నిర్మాణ పనులు తాత్కాలికంగా నిలిపివేశారు. కాలుష్యకారకాలైన స్టోన్ క్రషనర్లు, మిక్సింగ్ ప్లాంట్‌ను ఆపేశారు. అలాగే వాహనాలను క్రమబద్ధం చేయాలని రవాణాశాఖను పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని కేంద్ర పర్యావరణ మంత్రి హర్షవర్ధన్ హెచ్చరించారు. అలాగే చట్టపరమైన చర్యలూ తీసుకుంటామని ఆయన అన్నారు. కాగా పక్కనున్న పంజాబ్ వల్లే కాలుష్యం పెరిగిపోతోందనిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. వ్యర్థాలు తగలబెట్టడం వల్ల ఈ దుస్థితి తలెత్తిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అయితే పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ ఆదివారం మీడియాతోమాట్లాడుతూ కేజ్రీవాల్ ఆరోపణలను కొట్టిపారేశారు. మరోపక్క ఇలాంటి దహనాల వంటి కార్యక్రమాలు లూధియానా, జలంధర్, సిర్సా అలాగే హర్యానాలోని కొన్ని చోట్ల చోటుచేసుకుంటున్నట్టు ‘నాసా’ గుర్తించింది.

చిత్రం..దేశ రాజధాని హస్తినలో కాలుష్య తీవ్రత మరింత ప్రమాదకర స్థాయికి చేరిందన్న కథనాల నేపథ్యంలో సోమవారం నాటి దృశ్యమిది..