జాతీయ వార్తలు

మహిళలు రాకూడదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, నవంబర్ 5: ‘ఆలయాల్లోకి మహిళలు ప్రవేశించరాదు’ అనే అంశంపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. దేశంలోని కొన్ని ఆలయాల్లోకి మహిళల ప్రవేశం నిషిద్ధం. దీనిపై మహిళా సంఘాలు కోర్టులకెక్కడం వారికి అనుకూలంగా తీర్పులివ్వడం జరిగిపోయాయి. అయినప్పటికీ ప్రస్తుతం శబరిమల అంశం ఉద్రిక్తతలకు దారితీస్తోంది. ఇలాంటి సాంప్రదాయమే పశ్చిమ బెంగాల్ బీర్‌భూమ్ జిల్లాలోని తారాపీఠ్ శక్తిపీఠంలో అమలవుతోంది. 34 ఏళ్లుగా ఇక్కడ నిర్వహిస్తున్న మండపంలోని కాళీమాత పూజలకు మహిళలను అనుమతించరు. ఇక్కడి సంప్రదాయాన్ని మేం ఉల్లంఘించలేం... అలా కాదని ఎవరైనా మహిళలు రావడానికి ప్రయత్నిస్తే జరిగే పరిణామాలకు మేం బాధ్యులం కాదని ఆలయ కమిటీ సభ్యులు తెగేసి చెప్పారు. ఇక్కడ అమ్మవారికి సమర్పించే నైవేద్యాలు కూడా మగవారే తయారు చేస్తారు. ఆలయ కమిటీలో మహిళలు ఉన్నప్పటికీ వారెప్పుడూ అమ్మవారి పూజల్లో పాల్గొనరు. అయితే మండపంలో ప్రతిష్ఠించే అమ్మవారి విగ్రహాన్ని తీసుకువచ్చేటప్పుడు.. తిరిగి నిమజ్జనానికి తీసుకెళ్లేటప్పుడు మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారని వారు తెలిపారు. అయితే ఈ సాంప్రదాయంపై కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ‘పూజించేదే అమ్మవారిని.. అలాంటప్పుడు మహిళలను అనుమతించకపోవడంలో అర్థం లేదు.. అలాంటి కట్టుబాట్లు సరికాదు’ అని ప్రముఖ చరిత్రకారుడు నృసింహ ప్రసాద్ భండారి వ్యాఖ్యానించారు. ఆచారమంటే ఆచారమే.. మే కచ్చితంగా పాటించి తీరుతాం అంటున్నారు మహిళలు.