జాతీయ వార్తలు

ప్రభుత్వాల మధ్యే రాఫెల్ ఒప్పందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్: రాఫెల్ వ్యవహారంపై బీజేపీ ఎదురుదాడికి దిగుతోంది. ఈ అంశాన్ని రాజకీయ ఐటమ్‌గా మార్చుకుని కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తుతున్న నేపథ్యంలో సోమవారం ఈ వివాదాన్ని కొత్తమలుపు తిప్పింది. సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా సన్నిహితుడైన దళారి సంజయ్ భండారిని తొలగించడం వల్లే కాంగ్రెస్ పార్టీ కకావికలమైందని అందుకే ఈ అంశాన్ని పట్టుకుని వేళ్లాడుతోందని కేంద్ర మంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాల్ అన్నారు. గతంలో యూపీఏ ప్రభుత్వం అప్పటి వైమానిక దళం కంటే కూడా సంజయ్‌భండారి విషయంలోనే ఎంతో ఆందోళన చెందేదని మేఘ్‌వాల్ అన్నారు. అత్యాధునిక యుద్ధ విమానాలను సమకూర్చాలని భారత్ వైమానిక దళం ఎన్నోసార్లు అభ్యర్థించినప్పటికీ, అప్పటి యూపీఏ ప్రభుత్వం దాదాపు ఏడు సంవత్సరాల పాటు ఈ అంశాన్ని దాట వేసిందని అన్నారు. రాఫెల్ వ్యవహారంలో సంజయ్ భండారికి స్థానం లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో ఆందోళన మొదలైందన్నారు. ఈ వ్యవహారంలో దళారులకు స్థానం లేకుండా కేవలం ప్రభుత్వాల మధ్యే కుదిరేలా ఎన్డీఏ సర్కార్ పారదర్శకంగా వ్యవహరించిందని అన్నారు.