జాతీయ వార్తలు

కాంతులు పంచండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 6: దీపావళి పర్వదినం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మరో వైపు ప్రధానమంత్రి నరేంద్రమోదీ దీపావళి పండగ రోజు పవిత్ర పుణ్యక్షేత్రం, ద్వాదశ జ్యోతిర్లింగం కేదార్ నాథ్‌ను సందర్శించనున్నారు. రక్షణ శాఖ మంత్రి నిర్మలసీతారామన్ అరుణాచల్‌ప్రదేశ్‌లో జవాన్లతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొంటారు. నరేంద్రమోదీ కేదార్‌నాథ్ దేవాలయం సందర్శన ప్రాధాన్యత సంతరించుకోబోతోంది. బుధవారం ఉదయం ఇక్కడకు చేరుకున్న తర్వాత ముందుగా శివదర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత కేదార్‌పురి ప్రాజెక్టు పనులను సమీక్షిస్తారు. ఉదయం 9.45 గంటలకు ఆయన ఇక్కడకు చేరుకుంటారని ఉత్తరాఖండ్ ప్రధాన కార్యదర్శి ఉత్పల్ కుమార్ సింగ్ చెప్పారు. ఈ ప్రాజెక్టుల ప్రగతి తీరుపై వీడియో సమీక్ష నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులు పాల్గొంటారు. గత ఏడాది కూడా మోదీ కేదార్ నాథ్‌ను సందర్శించి కేదార్‌పురి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. మంచు దట్టంగా కురుస్తుండడంతో కేదార్‌నాథ్ పరిసరాల్లో మనోహర దృశ్యం సాక్షాత్కరిస్తుంది. ప్రధాని రాక నేపథ్యంలో ఇక్కడ మంచును తొలగించారు. ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నట్లు రుద్రప్రయాగ కలెక్టర్ మంగేష్ గిల్డీయాల్ చెప్పారు. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇంతవరకు పదిసార్లు మోదీ ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని సందర్శించారు.
మహారాష్టల్రోని థానే జిల్లాలో పేదలకు మిఠాయి పంపిణీ సందర్భంగా మంగళవారం
మహాత్మాగాంధీ, ప్రధాని మోదీ వేషాల్లో తరలివచ్చిన కళాకారులు అందర్నీ ఆకట్టుకున్నారు

చిత్రం..అయోధ్యలో జరగనున్న దీపోత్సవానికి హెలికాప్టర్‌లలో తరలివచ్చిన
రాముడు, సీత, లక్ష్మణ వేషధారులతో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్