జాతీయ వార్తలు

అద్భుతమైన అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయ్‌పూర్, నవంబర్ 10: రమణ్‌సింగ్ నాయకత్వంలో చత్తీస్‌గఢ్ రాష్ట్రం నాలుగుచెరుగుల అభివృద్ధి సాధించిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా స్పష్టం చేశారు. ఒక విధంగా సమస్యల రహిత రాష్ట్రంగా ఆవిర్భవించిందని శనివారం ఇక్కడ అన్నారు. నక్సలిజం సైతం బాగా తగ్గుముఖం పట్టిందని షా చెప్పారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష కాంగ్రెస్‌పై ఆయన తీవ్రమైన విమర్శలు చేశారు. కాంగ్రెస్‌తో ఎలాంటి మంచీ జరగదని ఆయన తేల్చిచెప్పారు. ‘బీజేపీ నాయకత్వంలో చత్తీస్‌గఢ్ ఎంతో అభివృద్ధి చెందింది. విద్యుత్, సిమ్మెంట్ ఉత్పత్తిలో హబ్‌గా ఆవిర్భవించింది’అని ఆయన అన్నారు. ఈనెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందన్న ధీమా ఆయన వ్యక్తం చేశారు. నాలుగో పర్యాయం అధికారం తమదేనని ఆయన జోస్యం చెప్పారు. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన తరువాత అమిత్‌షా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పారదర్శకపాలన సాగుతోంది, అద్భుతమైన అభివృద్ధి జరిగిందని అన్నారు. అభివృద్ధి విషయంలో రమణ్‌సింగ్ ప్రభుత్వం అన్ని రికార్డులను తిరగరాసిందని షా ప్రశంసించారు. 55 ఏళ్లపాటు కేంద్రంలో అధికారం చెలాయించిన కాంగ్రెస్ దేశాన్ని అధోగతి పాలుచేసిందని విరుచుకుపడ్డారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్ని చిత్తశుద్ధితో అమలుచేస్తామని బీజేపీ చీఫ్ హామీ ఇచ్చారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అవినీతికి ఆస్కారం లేకుండా అమలు చేసిన ఘనత రమణ్‌సింగ్ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఊకదంపుడు ఉపన్యాసాలు దంచడమే తప్ప చేసిందేమీ లేదని షా విమర్శించారు.