జాతీయ వార్తలు

టిప్పు జయంతిలో రాజకీయ అలజడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, నవంబర్ 10: మైసూరు రాజు టిప్పుసూల్తాన్ జయంతి ఉత్సవాలు ఉద్రిక్తతల నడుమ శనివారం కర్నాటక రాష్ట్రప్రభుత్వం నిర్వహించింది. 18వ శతాబ్ధానికి చెందిన టిప్పు సూల్తాన్ జయంతి వేడుకలకు ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి, ఉప ముఖ్యమంత్రి జి పరమేశ్వరప్ప హాజరు కాకపోవడం విశేషం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ వేడుకల నిర్వహణకు గట్టి పోలీసు భద్రతను ఏర్పాటు చేసింది. బెంగళూరులో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించాలనుకున్నారు. కాని ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కుమారస్వామి హాజరుకాకపోవడంతో పేలవంగా ఉత్సవాలు ముగిశాయి. మూడు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు చేసిన సూచన మేరకు ముఖ్యమంత్రి కుమారస్వామి హాజరు కాలేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరో డిప్యూటీ సీఎం పరమేశ్వరప్ప సింగపూర్‌లో ఉన్నారు. విధాన సౌధలో భారీ ఎత్తున ప్రభుత్వం టిప్పు సూల్తాన్ జయంతి వేడుకలకు సన్నాహాలు చేసింది. ఈ వేడుకలను భగ్నం చేస్తామని బీజేపీ పార్టీ ప్రకటించింది. విధాన సౌధ పరిసరాల్లో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మొహరించారు. ఈ కార్యక్రమానికి నీటిపారుదల శాఖ మంత్రి డీకే శివకుమార్, మైనార్టీ శాఖమంత్రి బీజడ్ జమీర్ అహ్మద్ ఖాన్, ఎమ్మెల్యేలు రోషన్ బేగ్, ఎన్‌ఏ హరీస్ హాజరయ్యారు.
కాగా ముఖ్యమంత్రి కుమారస్వామి హాజరు కాకపోవడంపై సంకీర్ణప్రభుత్వంలో ప్రధాన భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ముస్లిం సమాజాన్ని సీఎం అవమానపరిచారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విమర్శించారు. గతంలోముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న కుమారస్వామి టిప్పు సూల్తాన్ జయంతి వేడుకలు ఎందుకని ప్రశ్నించారు. డాక్టర్ల సలహాపై సీఎం కుమారస్వామి విశ్రాంతి తీసుకుంటున్నారని, టిప్పు సూల్తాన్ ప్రగతి శీలవాది అని, అభివృద్ధికి చేసిన సేవలు గొప్పవని జేడీఎస్‌నేతలన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం 2010 నుంచి ప్రతి ఏడాది నవంబర్ 10వ తేదీన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ జయంతి వేడుకలు జరిగిన పలు చోట్ల ముందు జాగ్రత్త చర్యగా బీజేపీ ఎమ్మెల్యేలను అదుపులోకి తీసుకుని అనంతరం పోలీసులు విడిచిపెట్టారు. చిక్‌మంగళూర్, బళ్లారి, కార్వార్ తదితర ప్రాంతాల్లో టిప్పు జయంతి సందర్భంగా అనేక చోట్ల ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. భద్రతను పటిష్టం చేయడంతో ఎటువంటి ఆందోళనలు జరగలేదు. కొడగు, చిత్రదుర్గ, కోస్తా ప్రాం తాల్లో ప్రజలు టిప్పు జయంతి వేడుకలను నిరసించారు. బ్రిటీష్ ప్రభుత్వంలో ఈస్ట్ ఇండియాకంపెనీ దురాక్రమణలపై ఆ నాటి రాజు టిప్పు సూల్తాన్ ఎదురుతిరిగి పోరాడారు. శ్రీరంగపట్నం వద్ద 1799 మే నెలలో టిప్పు సూల్తాన్‌ను బ్రిటీష్ సేనలు చంపాయి.

చిత్రం..శనివారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జరిగిన
టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలను అడ్డుకుంటున్న హిందూసేన కార్యకర్తలు