జాతీయ వార్తలు

అభ్యర్థులు తమ నేరచరిత్రపై మీడియాలో మూడుసార్లు ప్రకటనలివ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 11: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమపై నమోదై ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను ప్రకటనల రూపంలో పత్రికల్లో ప్రచురించాలని, టీవీల్లో ప్రసారం చేయాలని ఎన్నికల కమిషన్ కోరింది. ఒక వేళ ఈ నిబంధనను ఉల్లంఘిస్తే పెనాల్టీలు విధిస్తామని, కోర్టు ధిక్కారం కింద కేసును ఎదుర్కొనాల్సి ఉంటుందని ఎన్నికల సంఘం పేర్కొంది. మీడియాలో కనీసం మూడు సార్లు ప్రచురించాలని, ప్రసారం చేయాలని ఎన్నికల సంఘం తెలిపింది. అలాగే తమ రాజకీయ ప్రత్యర్థులపై తప్పుడుగా నేర కేసులను ప్రచురితం చేసేటట్లుంటే, అటువంటి అభ్యర్థులకు జరిమానాను విధిస్తామన్నారు. సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కోర్టు గత నెల 10వ తేదీన ఆదేశాలు జారీ చేసింది. మధ్యప్రదేశ్, రాజస్తాన్, తెలంగాణ, చత్తీస్‌గడ్, మిజోరాం ఎన్నికల్లో అభ్యర్థులు కోర్టు ఆదేశాలను పాటించాలన్నారు. రాజకీయ పార్టీలు తమ పార్టీ అభ్యర్థుల నేరచరిత్ర వివరాలను తెలియచేయాలన్నారు. నేర చరిత్ర లేని వారు ప్రకటనలు ఇవ్వాల్సిన పనిలేదన్నారు. ఒక వేళ ఆదేశాలనుపాటించని పక్షంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లుగా పరిగణించి ఓటర్లు కోర్టులో కోర్టు ధిక్కారం కింద పిటిషన్ దాకలు చేయవచ్చన్నారు.