జాతీయ వార్తలు

59 నిమిషాల్లో ఒక కోటి రుణం.. ఓ పెద్ద స్కాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 11: పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు 59 నిమిషాల్లో ఒక కోటి రూపాయల రుణం మంజూరు చేస్తామని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారని, ఇదంతా పెద్దస్కాం అని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. ఇది కేవలం దోపీడీచేసే సంస్థలకు ఉపయోగపడే స్కీం అని కాంగ్రెస్ నేత గౌరవ్ వల్లభ్ అన్నారు. ఈ స్కీంపై న్యాయమూర్తి చేత దర్యాప్తు చేయించాలని ఆయన కోరారు. ఈ స్కీం స్కాం అని తాము స్పష్టం చేస్తే దీనిపై కేంద్రం స్పందించడం లేదన్నారు. ప్రభుత్వం ఎత్తుగడల్లో భాగంగా ఈ నెల 2వ తేదీన ఈ స్కీంను ప్రారంభించినట్లు చెప్పారు. ఈ స్కీంను సిడ్బీ, పీఎస్‌యూ బ్యాంకులు స్పాన్సర్ చేస్తుండగా, వెబ్‌సైట్‌ను అహ్మదాబాద్‌కు చెందిన కేపిటా వరల్ట్ ప్లాట్‌ఫారమ్ ప్రైవేట్ సంస్థ నిర్వహిస్తోందన్నారు. ప్రతి చిన్న పరిశ్రమ రిజిస్ట్రేషన్‌కు జీఎస్‌టీ కింద రూ. 180 నుంచి రూ.1000ను ఈ సంస్థ వసూలు చేస్తున్నట్లు చెప ఆపరు. రుణం కోసం పది లక్షల చిన్నపరిశ్రమలు దరఖాస్తు చేస్తే దాదాపు వంద కోట్ల రూపాయలు ఈ సంస్థకు ఆదాయం కిందకు వస్తాయన్నారు. ప్రజలను దోపీడీ చేసేందుకు ఈ సంస్థకు ఈ బాధ్యతను అప్పగించారన్నారు. తన స్నేహితులకు ప్రయోజనం కల్పించేందుకు మోదీ ఈ స్కీంను ప్రారంభించారన్నారు.