జాతీయ వార్తలు

చర్చలే శరణ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐటానగర్, నవంబర్ 11: భారత్, చైనా మధ్య ఉన్న విబేధాలు వివాదాలుగా మారకుండా చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఈ ప్రాంతంలో శాంతి నెలకొనాలంటే, ఇర దేశాలు సమస్యలను, విబేధాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడం కంటే మించిన ఉత్తమ మార్గం మరొకటి లేదన్నారు. రక్షణ, సరిహద్దు వివాదాలు, సరిహద్దు వాణిజ్యం, హిందూమహాసముద్రంలో భారత్, చైనా సైనిక బలగాల మొహరింపు తదితర అంశాలను పరిష్కరించుకోవాల్సి ఉందని ఆమె చెప్పారు. ఇరు దేశాల మధ్య అభివృద్ధి విషయంలో పోటీ ఉ డాలని, కాని, ఈ పోటీ ఘర్షణాత్మక విధానాలకు దారితీయరాదన్నారు. అభిప్రాయబేధాలు వివాదాలుగా మారరాదన్నారు. చర్చల్లోనే పరిష్కారం ఉంటుందన్నారు. ఈ చర్చలు విశ్వాసంతో జరగాలన్నారు. ఆరెస్సెస్ కార్యకర్త రుతుమ్ కాంగో ఏడవ స్మారకోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య సరిహద్దుల వద్ద ఉన్న గ్రామాలను వాణిజ్యంలో భాగస్వాములను చేయాలన్నారు. సిక్కిం వద్ద నాథూలా వద్ద, మణిపూర్‌లోని మొరే వద్ద వాణిజ్యం జరిగేందుకు అవకాశం ఉందన్నారు.