జాతీయ వార్తలు

ఎలాంటి సవాళ్లకైనా సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 11: ఇండో పసిఫిక్ ప్రాంతంలో మనకు ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత వైమానిక దళం పూర్తి అప్రమత్తంగా ఉందని, భారత జాతి ప్రయోజనాలకు భంగం కలిగించే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని భారత వైమానిక దళ అధిపతి మార్షల్ బిఎస్ ధనోవా తెలిపారు. ఆదివారం ఆయన పీటీఐతో మాట్లాడారు. సరిహద్దుల మధ్య ఏర్పడిన వివాదాల నేపథ్యంలో కొన్ని పొరుగు దేశాల వారు నూతన సాంకేతిక పరిజ్ఞానం, అధునాతన ఆయుధాలు సమకూర్చుకుంటున్న విషయం ఆయన ప్రస్తావిస్తూ ఎలాంటి పరిణామమైనా ఎదుర్కోవడానికి భారత్ పూర్తి సామర్థ్యం కలిగి ఉందని, వాటిని సమర్థంగా తిప్పికొట్టగల సత్తా ఉందని అన్నారు. జమ్మూకాశ్మీర్‌లోని ఆధీన రేఖ వద్ద ఉన్న టెర్రరిస్టు శిక్షణ శిబిరాలను భారత వైమానిక దళం నాశనం చేసే యోచనను తోసిపుచ్చలేమని అన్నారు. అయితే ముఖ్యంగా మనకు రెండుదేశాల నుంచి భూభాగ సరిహద్దు వివాదాలకు సంబంధించి సవాళ్లు ఉన్నాయని ఆయన పాక్, చైనా దేశాలను ప్రస్తావించకుండా అన్నారు. మనకున్న సామర్థ్యంతో దేశానికి ఎదురయ్యే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు వైమానిక దళం నిత్యం సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. భారత్‌ను ఆనుకుని ఉన్న టిబెట్ అటానమస్ రీజియన్ (టిఎఆర్)లో చైనా దేశం తన వాయుదళాన్ని పటిష్టంగా, ఆధునికంగా తయారు చేయడాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావిస్తూ భారత్ సరిహద్దు ప్రాంతంలో ఎదురయ్యే అన్ని సవాళ్లను ఎదుర్కొనే సత్తా భారత్‌కు ఉందని అన్నారు. భారత్ వైమానిక దళం సామర్థ్యం గురించి ఆయన ప్రస్తావిస్తూ అత్యధిక సి-17 విమానాలు కలిగిన దేశాల్లో ప్రపంచంలోనే భారత్ రెండవదని ఎయిన్ చీఫ్ మార్షల్ బిఎన్ ధనోవా తెలిపారు.