జాతీయ వార్తలు

వర్మపై నేడు సుప్రీంకు సీవీసీ నివేదిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 11: సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మపై వచ్చిన అభియోగాలపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణ జరిపిన సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ నేడు సోమవారం కోర్టుకు నివేదిక సమర్పించనుంది. సీబీఐలో ఉన్నతాధికారుల మధ్య నెలకొన్న తగాదాల నేపథ్యంలో ఈ అంశం సుప్రీంకోర్టుకు చేరింది. ఈ అంశంపై సుప్రీంకోర్టు గత నెలలో విచారించింది. రెండు వారాల్లోగా సీబీఐ డైరెక్టర్ వర్మపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కోర్టు సీవీసీని ఆదేశించింది. సీల్డ్ కవర్‌లో సీవీసీ ఎటువంటి నివేదిక ఇస్తుందనే అంశంపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. సీబీఐలో డైరెక్టర్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్తానా మధ్య మనస్పర్థలు తారాస్థాయికి చేరుకున్న విషయం విదితమే. కోర్టు ఆదేశం మేరకు సీవీసీలో చీఫ్ కమిషనర్ కేవీ చౌదరి ఆధ్వర్యంలోముగ్గురు సభ్యులు వర్మను విచారించారు. వర్మ తనపై వచ్చిన అభియోగాలను తోసిపుచ్చినట్లు సమాచారం. కాగా సోమవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్‌కేకౌల్ ఆధ్వర్యంలో ధర్మాసనం వర్మ కేసును విచారిస్తుంది. సీవీసీ ఇచ్చే నివేదికను పరిశీలిస్తుంది. వర్మ కేసులో సీవీసీ విచారణను మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏకే పట్నాయక్ పర్యవేక్షించారు. సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా నియమితులైన ఎం నాగేశ్వరరావు కూడా రోజూవారీ కార్యకలాపాలను పర్యవేక్షించాలని, పాలసీ నిర్ణయాలు తీసుకోరాదని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం విదితమే. గత నెల 23వ తేదీన నాగేశ్వరరావు తీసుకున్న నిర్ణయాలను సుప్రీంకోర్టు సోమవారం సమీక్షించే అవకాశం ఉంది. తాత్కలిక డైరెక్టర్ తీసుకున్న నిర్ణయాలను తమకు నివేదిక రూపంలో ఇవ్వాలని కూడా కోర్టు సీబీఐను ఆదేశించింది. సీబీఐ స్పెషల్ డైరెక్టర్ ఆస్తానా కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే.