జాతీయ వార్తలు

ఆలయం నిర్మిస్తేనే ప్రశాంతత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 11: అయోధ్యలో రామమందిరం నిర్మించాలని, అప్పుడే ముస్లింలు ఈ దేశంలో ప్రశాంతంగా, గౌరవంగా జీవించగలుగుతారని మైనారిటీల జాతీయ కమిషన్ చీఫ్ ఘాయరుల్ హసన్ రిజ్వి ఆదివారం నాడిక్కడ పేర్కొన్నారు. అలాగే ఈ వివాదానికి త్వరగా పరిష్కారం చూపి అన్నివర్గాల వారిమధ్య సంబంధాలు బలపడేందుకు దోహదం చేయాలని రిజ్వి కోరారు. అయోధ్య స్థల వివాదానికి సంబంధించిన కేసులో మైనార్టీల జాతీయ కమిషన్ జోక్యం చేసుకోవాలని కొన్ని ముస్లిం సంస్థలు కోరతున్నాయన్నారు. ఈక్రమంలో ఈ కేసు హియరింగ్ త్వరగా కోర్టు ముందుకు వచ్చేలా సుప్రీం కోర్టును కోరాలా వద్దా అనే విషయంపై ఈనెల 14న జరిగే కమిషన్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ముస్లింలతోబాటు మరికొన్ని మతాలకు చెందినవారు ఈ దేశంలో భయంతోనే జీవిస్తున్నారంటూ జాతీయ మైనారిటీ సంక్షేమ సంస్థతోబాటు మరికొన్ని ప్రజాసంఘాలు తమకు నివేదికలు అందజేశాయని రిజ్వి పీటిఐకి తెలిపారు. అయితే న్యాయస్థానం పరిధిలోవున్న ఈ కేసు విషయంలో తమకు పూర్తి అధికారాలు లేవని, ఈ కేసు విచారణను త్వరగా పూర్తిచేయాలని మాత్రం అత్యున్నత న్యాయస్థానాన్ని తాము అర్థించగలమని అన్నారు. రామమందిర నిర్మాణానికి, భవిష్యత్తులో వివాదం మళ్లీ తలెత్తకుండా ముస్లింలు సహకరించాలని కోరారు.