జాతీయ వార్తలు

నగదు బదిలీకి ఓ ఫార్ములా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూడిల్లీ, నవంబర్ 11: రిజర్వ్‌బ్యాంక్ స్వయంప్రతిపత్తి, దాని కార్యక్రమాల్లో కేంద్రం జోక్యంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చలు కేవలం విభిన్న వర్గాల అభిప్రాయాలు మాత్రమేనని, ఆర్‌బిఐ చట్టంలోని సెక్షన్ 7 ప్రయోగంపై మాత్రమే చర్చలు దురదృష్టకరమని ఆర్‌బిఐ మాజీ డిప్యూటీ గవర్నర్ ఆర్.గాంధీ వ్యాఖ్యానించారు. 2014-17 మధ్య ఆర్‌బిఐ డిప్యూటీ గవర్నర్‌గా పనిచేసిన ఆయన పీటిఐతో మాట్లాడుతూ సెక్షన్ ఏడుకు సంబంధించి కేంద్రానికి ఉన్న ప్రత్యేక అధికారాలపై చర్చ జరగడం ఇది కొత్తేమీ కాదని అన్నారు. అయితే నగదు బదిలీకి సంబంధించి ఇప్పటికైనా ఒక ఫార్ములా తయారు చేయడం ఉత్తమమమని ఆయన అభిప్రాయపడ్డారు. ఆర్‌బిఐ చట్టం సెక్షన్ ఏడు ప్రకారం ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఆర్‌బిఐకి కొన్ని ఆదేశాలు జారీ చేసే ప్రత్యేక అధికారాన్ని కల్పించిందని చెప్పారు. అయితే కొన్ని విషయాల్లో కేంద్రం, ఆర్‌బిఐ మధ్య కొన్ని విషయాలలో తరచూ అభిప్రాయ భేదాలు తలెత్తుతున్నాయని అన్నారు. ‘కేంద్రం- కేంద్రబ్యాంకు క్రమం తప్పకుండా సమావేశమై చర్చలు జరుపుతూ ఉంటే ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమై ఉండేది కాదు’ అని ఆయన ఉద్ఘాటించారు. అలా జరగకపోవడం వల్ల స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఆర్‌బిఐలో ఏదో జరుగుతోందన్న అనుమానాలు ప్రతి ఒక్కరికీ వస్తున్నాయన్నారు. ఇరువర్గాలు సామరస్యపూర్వకంగా చర్చలు జరిపితే అన్ని సమస్యలు వాటంతట అవే తొలగుతాయని ఆయన చెప్పారు. మిగులు నగదు నిల్వల బదలాయింపు వివాదాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఆర్‌ఐబి వార్షిక ఆడిట్ ముగిసిన తర్వాత బాకీఉన్న మొత్తం ప్రభుత్వానికి ఇవ్వడం సాధారణమేనని అన్నారు. ప్రస్తుతం కేంద్ర బ్యాంకు వద్ద 9.59 లక్షల కోట్ల నగదు నిల్వలు ఉన్నాయని, ఇప్పుడు వస్తున్న వార్తలు కనుక నిజమైతే అందులో మూడో వంతు మొత్తాన్ని బదలాయింపు చేయమని కేంద్రం కోరుతోందని అన్నారు. ప్రభుత్వాలు చాలా విషయాలను స్వల్పకాలిక దృష్టితోనే చూస్తున్నాయని, కాని ఆర్‌బిఐ మాత్రం మధ్య, దీర్ఘకాలిక అంశాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. దీంతో కేంద్రానికి, ఆర్‌బిఐకి వేర్వేరు ప్రాధాన్యాలు ఉండటం వల్ల ఒక విషయంపై విభిన్న అభిప్రాయాలు ఏర్పడి, తద్వారా విభేదాలకు దారితీయవచ్చునని అన్నారు. ఏ విషయంపైనే విభిన్న అభిప్రాయాలు వ్యక్తం కావడం మంచి పరిణామమని ఆయన వ్యాఖ్యానించారు. ఏదైనా విషయంపై అభిప్రాయ భేదాలు ఏర్పడినప్పుడు నిరవధిక చర్చలే దానికి పరిష్కారమని ఆయన అన్నారు. కనుక ఇప్పుడు ఆర్‌ఐబి, కేంద్రం మధ్య ఏర్పడిన పరిణామాలపై చర్చలు జరగడం తప్పుగా తాను భావించడం లేదని అన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి నగదు బదిలీకి సంబంధించి ఒక ఫార్ములా కాని మోడల్‌ను కాని ఏర్పాటు చేయాలని నాలుగు సంవత్సరాల క్రితమే అప్పటి ఆర్‌బిఐ గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. అయితే అప్పట్లో ప్రభుత్వం దానిని అంగీకరించడానికి సిద్ధపడలేదని చెప్పారు. కాని ఇప్పుడు ప్రభుత్వం దానినే డిమాండ్ చేస్తోందని అన్నారు. తన ఉద్దేశంలో ఆర్‌బిఐ కూడా దానికి అంగీకరించి నగదు బదిలీకి సంబంధించి ఒక ఫార్ములాను తయారు చేయడం ఉత్తమమని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకసారి కనుక దానిని తయారు చేస్తే ఇక భవిష్యత్‌లో ఆర్‌బిఐ దానికి కట్టుబడి ఉంటుందని చెప్పారు. బ్యాంకింగ్ వ్యవస్థలోని కొన్ని నియమాలను మినహాయించడానికి ఆర్‌బిఐ ప్రయత్నిస్తోందన్న ఆరోపణలపై ఆయన ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వం డిమాండ్లకు అంగీకరించి ఆర్‌బిఐ ఇలా చేస్తోందని మనం భావించరాదని అన్నారు. ఆర్‌బిఐ ఏ చర్య చేపట్టినా వినియోగదారుల ప్రయోజనాలు, ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకునే తీసుకుంటుందని ఆర్‌బిఐ మాజీ డిప్యూటీ గవర్నర్ గాంధీ అన్నారు.

చిత్రం..ఆర్‌బిఐ మాజీ డిప్యూటీ గవర్నర్ గాంధీ