జాతీయ వార్తలు

పొంచివున్న ఉగ్రభూతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూ, నవంబర్ 11: ఉగ్రవాద నిర్మూలనకు భారత్ ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా పాకిస్తాన్ మాత్రం తన వైఖరి మార్చుకోవడం లేదు. తన ఉగ్రవాద కార్యకలాపాలకు ఫుల్‌స్టాప్ పెట్టడం లేదు. తాజాగా 160 మంది ఉగ్రవాదులు భారత్‌లో చొరబడటానికి ఆధీన రేఖ వద్ద కాచుకుని ఉన్నారని లెఫ్టినెంట్ జనరల్ పరమ్‌జిత్ సింగ్ వెల్లడించారు. పాకిస్తాన్ తన విధానాలు, ఉద్దేశాలు మార్చుకుంటే తప్ప ఈ సరిహద్దు ఉగ్రవాదానికి తెరపడదని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఈ చొరబాటుదారులకు అడ్డుకట్ట వేయడానికి, వారిని దీటుగా ఎదుర్కోడానికి భారత్ సైన్యం పూర్తి అప్రమత్తంగా, సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. పాకిస్తాన్‌లో శిక్షణ పొందిన 140 నుంచి 160 మంది ఉగ్రవాదులు వివిధ ప్రదేశాల నుంచి భారత్‌లో చొరబడటానికి కాచుకుని ఉన్నారని చెప్పారు. వౌలికంగా ఈ ఉగ్రవాద వ్యవస్థ పాకిస్తాన్‌లో పటిష్టంగా ఉందని, భారత్ విషయంలో పాకిస్తాన్ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని అన్నారు. పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్‌ఐల నేతృత్వంలో భారత్ సరిహద్దులో నిరంతరం దాడులు నిర్వహించడానికి అవి ప్రయత్నిస్తూనే ఉన్నాయన్నారు. డిజిఎంఓ స్థాయి చర్చలను సైతం ఉల్లంఘించి పాక్ ఆధీన రేఖ వద్ద కాల్పులకు తెగబడుతోందని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం ఆధీనరేఖ వద్ద దళాల మధ్య ఎలాంటి కాల్పుల ఒప్పందం లేదని, పాక్ దళాలు క్రమం తప్పకుండా కాల్పులు జరుపుతూ భారత్ పోస్టులపై దాడులు కొనసాగిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. అయితే వారికి తాము దీటైన సమాధానం చెబుతున్నామని ఆయన చెప్పారు. వచ్చే శీతాకాలంలో దట్టమైన మంచు ఏర్పడుతుందని, అదే సమయంలో భారత్‌లోకి చొరబడాలని పాక్ ప్రయత్నం చేస్తున్నట్టు తమకు సమాచారం ఉందన్నారు. దీనిని ఎదుర్కోవడానికి అవసరమైన ప్రణాళికను తాము సిద్ధం చేశామని, దానిని వివిధ భద్రతా దళాలతో సమన్వయం చేసుకుని తగువిధంగా అమలు చేస్తామని చెప్పారు. భారత్ దళాల కాల్పుల్లో ఎంతమంది పాక్ సైనికులు మరణించారన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌కు చెందిన సైనికుల మరణాల గురించి పాక్ ఎన్నడూ వెల్లడించదని లెఫ్టినెంట్ జనరల్ పరమ్‌జిత్ సింగ్ పేర్కొన్నారు.