జాతీయ వార్తలు

నిన్న చిన్నచూపు.. నేడు పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనాజీ, నవంబర్ 12: భారతీయ ఆరోగ్య సాధనమైన యోగా విషయంలో 70, 80దశకంలో ఉన్న ప్రతికూల భావన తొలగిపోయిందని, ఇప్పుడు ఈ విధానాన్ని ప్రపంచ దేశాలన్నీ ఆహ్వానిస్తున్నాయని ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ అన్నారు. సోమవారం ఇక్కడ కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీపాద్ నాయక్‌తో కలిసి అంతర్జాతీయ యోగా కనె్వన్షన్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రవిశంకర్ ఒకప్పుడు యోగాకు సంబంధించి పశ్చిమ దేశాల్లో చిన్నచూపు ఉండేదని ఒంటికి విభూది పూసుకుని బవిరిగడ్డంతో ఒంటికాలిపై నిలబడే వ్యక్తుల సాధనంగానే దీన్ని పరిగణించేవారని చెప్పారు. అప్పట్లో యోగా టీచర్లు అనేక రకాలుగా అవహేళనలను ఎదుర్కొనేవారని కూడా రవిశంకర్ గుర్తు చేశారు. కానీ, తాను యోగా తరగతులను ఆర్ట్ ఆఫ్ లివింగ్‌గా మార్చానని, దానితో అందరిలోనూ ఆసక్తి పెరిగిందని చెప్పారు. కొన్ని దశాబ్దాల క్రితం యోగాను అవహేళన చేసిన దేశాలే ఇప్పుడు దాని బాట పట్టడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందన్నారు. అలాగే అనేక సంస్థలు యోగాపై పరిశోధనలూ చేస్తున్నాయని, దీని వల్ల ప్రపంచ ప్రజల్లో మరింత ఆసక్తి పెరిగిందని చెప్పారు. జీవన శైలిలో వచ్చిన మార్పుల వల్ల తలెత్తే ఎన్నో జబ్బులను యోగా ద్వారా నయం చేసుకోవచ్చునని కేంద్ర మంత్రి శ్రీపద్ నాయక్ అన్నారు. పశ్చిమ దేశాల్లోనూ యోగా పట్ల ఆసక్తి పెరిగిందని, ఒక్క అమెరికాలోనే 2కోట్ల మంది యోగా సాధన చేస్తున్నట్టు తెలుస్తోందన్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయిన కేంద్ర వాణిజ్య మంత్రి సురేష్ ప్రభు వీడియో సందేశం పంపారు. వైద్య ఖర్చు పెరిగిపోయిందని, ఆసుపత్రిలో చేరడం వల్ల ప్రజలకు ఉన్నవికాస్త ఊడ్చుకు పోయే పరిస్థితి తలెత్తుతోందని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. ప్రభుత్వాలపై భారం వేయకుండా ప్రజలకు ఆరోగ్య సంరక్షణను కలిగించడం ఓ సవాలుగా పరిణమించిందని అన్నారు.