జాతీయ వార్తలు

అమేథీకి ఇజ్రాయెల్ అరటిచెట్ల నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, నవంబర్ 19: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నియోజకవర్గమైన అమేథీలో రైతులకు ఇజ్రాయెల్ నుంచి తెప్పించిన అరటిచెట్ల నారును అందజేసేందుకు ఏర్పాట్లు చేశారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో నుంచి ఎలాగైనా గెలుపొందాలని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తరచుగా పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఈ ఏడాదిలో పదివేల చీరలను మహిళలకు అందజేస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో 40వేల అరటిచెట్ల నారును ఇజ్రాయెల్ నుంచి తెప్పించి ‘కేతిహార్ మజ్దూర్ సంఘ్’ ద్వారా రైతులకు అందజేయనున్నట్లు కాంగ్రెస్ ప్రతినిధి అన్షు అవస్థి పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు. ఈ నారు వేయడం ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలసాయం వస్తుందని ఆయన వెల్లడించారు. ఇందిరా గాంధీ జయంతి నవంబర్ 19 నుంచి సోనియా గాంధీ జన్మదినమైన డిసెంబర్ 9 వరకు ఈ నారు పంపిణీ చేస్తామని అవస్థి వివరించారు. రైతులకు ఇలాంటి మేలు చేయడం ఇదే మొదటిసారి కాదని ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన కాంగ్రెస్ నేతలందరూ ఇలాంటి కార్యక్రమాలే చేస్తూ వస్తున్నారని, అందుకే అమేథీ నియోజకవర్గం కాంగ్రెస్‌కు బలమైన స్థానమని అన్నారు.