జాతీయ వార్తలు

సహనం నశిస్తోంది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనాజీ, నవంబర్ 21: గోవాలో గనుల తవ్వకాలను పూర్తిగా నిలిపివేయడంతో ఆ రంగంపై ఆధారపడ్డవారు లబోదిబోమంటున్నారు. కేంద్రం తీసుకువచ్చిన మైనింగ్ చట్టాన్ని రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చింది. దీంతో 88 గనుల లీజింగ్ రెన్యువల్ చేయకుండా స్థానిక కోర్టు పెండింగులో ఉంచడంతో ఈ ఏడాది మార్చి నుంచి ఈ రంగంపై ఆధారపడ్డవారు పూర్తిగా ఉపాధిని కోల్పోయారు. దీనిపై స్పందించిన గోవా మైనింగ్ పీపుల్స్ ఫ్రంట్ (జీఎమ్‌పీఎఫ్) అధ్యక్షుడు పుతి గావ్‌కార్ మాట్లాడుతూ, తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ డిసెంబర్ 11, 12, 13 తేదీల్లో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేయనున్నట్లు వెల్లడించారు. ఉపాధి కోల్పోయిన ప్రజల్లో అసహనం పెరిగిపోతోందని ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలను ఇదే విషయమై నిలదీయడం జరుగుతోందని ఆయన అన్నారు. గోవాలోని బీజేపీ ప్రభుత్వం చట్టాన్ని సవరించి ప్రజలకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చిందని, అయినప్పటికీ ఎలాంటి చర్యలు జరగలేదని విమర్శించారు. మైనింగ్ శాఖ బాధ్యతలు సైతం నిర్వర్తిస్తున్న ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ అనారోగ్యం కారణంగా ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు వినయ్ టెండూల్కర్ మాత్రం త్వరలోనే ఈ సమస్యకు ఒక పరిష్కారం లభిస్తుందని హామీ ఇచ్చారు.