జాతీయ వార్తలు

మందిర నిర్మాణానికి కట్టుబడి ఉన్నాం: బీజేపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, నవంబర్ 21: అయోధ్యలో రామమందిర నిర్మాణానికి బీజేపీ కట్టుబడి ఉందని, ఈ విషయంలో తమ విధానం స్పష్టంగా ఉందని పార్టీ ప్రకటించింది. అయోధ్య అంశంపై ఓ రాజకీయ తీర్మానం చేసిన పార్టీ దేశంలో బీజేపీ ఒక్కటేనని యూపీ రాష్ట్ర అధ్యక్షుడు మహేంద్రనాథ్ పాండే స్పష్టం చేశారు. 2019 ఎన్నికలకు రామమందిరం నిర్మాణానికి సంబంధం లేదని బుధవారం ఆయన వివరించారు. ఈనెల 25న జరిగే సాధువులు, సన్యాసుల సభ వెనక బీజేపీ లేదన్న ఆయన ‘వారంటే మాకేంతో గౌరవం. పీఠాధిపతులను మేం ఎప్పుడూ గౌరవిస్తాం’అని అన్నారు. అధికార పార్టీగా దేశ ప్రజలకు సేవచేయడమే తమ ప్రధమ కర్తవ్యవని పాండే పేర్కొన్నారు. ‘1989లోనే హిమాచల్‌ప్రదేశ్‌లో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గసమావేశంలో అయోధ్యలో రామాలయం నిర్మాణానికి మద్దతు ఇస్తూ రాజకీయ తీర్మానం చేసింది’అని ఆయన గుర్తుచేశారు. అయోధ్య అంశం ప్రజల విశ్వాసం, భక్తికి సంబంధించిందని ఆయన అన్నారు. చట్ట ప్రకారమే రామమందిరాన్ని నిర్మించాన్నదని పార్టీ విధానమని, దానికి కట్టుబడి పనిచేస్తున్నామని ఆయన తెలిపారు.