జాతీయ వార్తలు

ప్రతి జీవితమూ ఓ అద్భుత కథే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనాజీ, నవంబర్ 21: దేశంలో ప్రతి ఒక్కరి జీవితమూ ఓ అద్భుత కథేనని, అయితే దానిని సరైన రీతిలో చెప్పగలగాలని కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి రాజ్యవర్థన్ రాథోడ్ అన్నారు. బుధవారం పనాజీలో ఆయన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాను ప్రారంభించారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న ఫిల్మ్ ఫెస్టివల్ 49వ దని, ఈ ఫెస్టివల్ ద్వారా అంతర్జాతీయంగా ఉన్న సినీ మేధావులు, టెక్నాలజీతో మనకు పరిచయం ఏర్పడుతుందని వెల్లడించారు. ఇది భారతీయ సినీ ఇండస్ట్రీ ఎదుగుదలకు ఎంతో ఉపకరిస్తుందని అన్నారు. భారతదేశం చారిత్రాత్మకంగా ఎన్నో కథలకు పుట్టినిల్లని, వీటిని సరైన పద్ధతిలో చెప్పగలిగితే అంతర్జాతీయంగా వీటికి ప్రాధాన్యత ఏర్పడుతుందని అన్నారు. వచ్చే సంవత్సరం యాభయ్యవ ఫిల్మ్ ఫెస్టివల్‌ను గోవా ఎంటర్‌టైన్‌మెంట్ సొసైటీతో కలిపి అట్టహాసంగా నిర్వహిస్తామని తెలిపారు.