జాతీయ వార్తలు

మోదీ పాలనలో అప్రతిష్టపాలవుతున్న వ్యవస్థలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండోర్, నవంబర్ 21: దేశంలోని పార్లమెంట్, సీబీఐ లాంటి వ్యవస్థలు ప్రధాని మోదీ పాలనలో క్రమంగా అప్రతిష్టపాలు అవుతున్నాయని, దీనిపై అప్రమత్తమై సరైన ఆలోచనలతో సరిచేయడానికి ప్రయత్నించకపోతే మన ప్రజాస్వామ్యం బలహీనపడుతుందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హెచ్చరించారు. బుధవారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ మోదీ ప్రభుత్వ హయాంలో అవినీతి తారస్థాయికి చేరుకుందని అన్నారు. పార్లమెంట్, సీబీఐ లాంటి స్వతంత్ర వ్యవస్థలు రానురాను ప్రాభవాన్ని కోల్పోతూ తమ విలువను దిగజార్చుకుంటుండటం మనం చూస్తున్నామని, దీనిపై ఇకనైనా మేల్కోకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థ బలహీనమవుతుందని అన్నారు. పాలనా వ్యవస్థ దాడికి గురవుతోందని, ప్రస్తుత పరిస్థితిలో మార్పు రాకపోతే చరిత్ర మనల్ని క్షమించదని ఆయన హెచ్చరించారు. నోట్ల రద్దును వ్యవస్థీకృత, న్యాయబద్ధ దోపిడీగా వర్ణించిన ఆయన దాని వల్ల జరిగిన నష్టాలను ఇంక వెనక్కి తీసుకురాలేమని అన్నారు. ప్రధాన మంత్రి పదవిని మోదీ దుర్వినియోగం చేస్తున్నారని, రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేయడానికి దానిని ఉపయోగించుకుంటున్నారని మన్మోహన్ సింగ్ విమర్శించారు.