జాతీయ వార్తలు

జాప్యానికి కాంగ్రెస్సే కారణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన సిక్కుల ఊచకోత కేసుకు సంబంధించి వెలువడిన తీర్పుపై బీజేపీ హర్షం వ్యక్తం చేస్తూ, అల్లర్ల బాధితులకు దశాబ్దాల పాటు న్యాయం జరగకపోవడానికి కాంగ్రెస్సే కారణమని ఆరోపించింది. ఇప్పుడు మధ్యప్రదేశ్ ఎన్నికల ఇన్‌చార్జిగా ఉన్న కమలనాథ్‌ను సిక్కుల నిరసనతో గత ఏడాది జరిగిన పంజాబ్ ఎన్నికల్లో పార్టీ ఇన్‌చార్జిగా ఎందుకు తొలగించాలో కాంగ్రెస్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసింది.
ఈ కేసులో ఒక వ్యక్తికి మరణశిక్ష, మరో వ్యక్తికి జీవితఖైదును శిక్షగా ఢిల్లీ కోర్టు విధించిన నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ ఈ తీర్పుపట్ల తమ పార్టీ సంతృప్తికరంగా ఉందని అన్నారు. కాంగ్రెస్ హయాంలో తమకు న్యాయం జరగదని అల్లర్ల బాధితులు భావించారని, కాని నరేంద్రమోదీ ప్రభుత్వ హయాం లో ఏర్పాటు చేసిన సిట్ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి బాధితులకు న్యాయం చేసిందని ఆయన చెప్పారు. కాగా, తీర్పుపై కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి స్పందన లేదని ఆయన అన్నారు. ఈ అల్లర్లతో సంబంధముందని భావిస్తున్న కమలనాథ్‌ను పలువురు సిక్కులు వ్యతిరేకించడంతో గత సంవత్సరం జరిగిన పంజాబ్ ఎన్నికల్లో ఆయనను ఇన్‌చార్జి పదవి నుంచి కాంగ్రెస్ తప్పించిందని చెప్పారు. ఆయనను అప్పుడు పదవి నుంచి ఎందుకు తప్పించారో కాంగ్రెస్ వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. సిక్కుల ఊచకోత కేసుకు సంబంధించి తనకు ఎలాంటి సంబంధం లేదని గతంలో కమలనాథ్ ఖండించారని, అయినా ఆయన ఎందుకు పంజాబ్ ఇన్‌చార్జిగా తొలగారని రవిశంకర్ ప్రశ్నించారు. సిక్కులపై జరిగిన దాడిపై అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ క్షమాపణలు కోరారని, అలాగే అదే పార్టీకి చెందిన మన్మోహన్ సింగ్ సైతం క్షమాపణలు అడిగారని ఆయన గుర్తు చేశారు. రెండు దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ సిక్కుల ఊచకోత బాధ్యులపై ఎందుకు చర్య తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు.
ఈకేసుల్లో విచారణను కాలయాపన చేయడానికి మాత్రమే కాంగ్రెస్ హయాంలో పలు కమిటీలను వేశారని ఆయన ఆరోపించారు. ఈ అల్లర్లపై అటల్ బిహారి వాజపేయి హయాంలో ఏర్పాటు చేసిన నానావతి కమిషన్ ఇందిరాగాంధీ హత్యానంతరం సిక్కులపై దాడులు ఒక పథకం ప్రకారమే జరిగాయని, దీనికి పోలీసుల వైఫల్యం కారణమని పేర్కొందని, ఆ కమిషన్ తన నివేదికను 2004లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సమర్పించిందని ఆయన చెప్పారు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం దోషులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని రవిశంకర్ ఆరోపించారు. కమిషన్‌కు నేతృత్వం వహించిన జస్టిస్ రంగనాథ్ మిశ్రా అల్లర్లకు ముఖ్యంగా పోలీసుల వైఫల్యాన్ని ఎత్తిచూపిందని, అల్లర్లను కేవలం హింస ప్రేరేపిత కేసుగా చూడరాదని పేర్కొందని అన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ తర్వాత ఆయనను 1998లో రాజ్యాసభకు నామినేట్ చేసిందని చెప్పారు. ఆయన రిపోర్టుకు కాంగ్రెస్ ఇచ్చిన బహుమతా అది అని రవిశంకర్ అన్నారు. 2002లో జరిగిన గుజరాత్ అల్లర్ల కేసుల్లో పలువురికి శిక్షలు పడ్డాయని, కాని దాదాపు మూడున్నర దశాబ్దాల క్రితం జరిగిన సిక్కుల ఊచకోతలో బాధితులకు ఎందుకు న్యాయం జరగలేదని ఆయన ప్రశ్నించారు.