జాతీయ వార్తలు

బీసీ కమిషన్ గడువు పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 22: కేంద్ర బీసీ రిజర్వేషన్లను వర్గీకరించేందుకు ఏర్పాటుచేసిన బీసీ కమిషన్ పదవీ కాలాన్ని మరో ఆరు నెలలపాటు పొడిగించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం జరిగిన కేంద్ర మంత్రివర్గం సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం కల్పించే వెనుకబడిన కులాల రిజర్వేషన్లను వర్గీకరించేందుకు కమిషన్‌కు ఇచ్చిన సమయాన్ని ఇప్పుడు 2019 మే 31 తేదీ వరకు పొడిగించారు. కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన కులాలకు ఇచ్చిన రిజర్వేషన్లను బీసీ ఉపకులాల వారీగా వర్గీకరించేందుకు ఏర్పాటైన కమిషన్ ఇంతవరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్రాల వెనుకబడిన కులాల కమిషన్లు, వివిధ కుల సంఘాలు, సామాన్య ప్రజలతో చర్చలు జరిపింది. వారి అభిప్రాయాలను రాతపూర్వకంగా తీసుకున్నది. ఆయా రాష్ట్రాల వారీగా ఉన్న వెనుకబడిన కులాల్లోని ఉపకులాలకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించింది. ఉన్నత విద్యా సంస్థల్లో చదువుతున్న, కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాలు, శాఖలు, కేంద్ర పరిధిలోని పబ్లిక్ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో పనిచేస్తున్న వెనుకబడిన కులాల వారి వివరాలను కూడా బీసీ కమిషన్ సేకరించింది. ఈ సమాచారాన్ని క్రోడీకరించిన నేపథ్యంలో తుది నివేదికను తయారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్రాల వెనుకబడిన కులాల కమిషన్లతో మరోసారి చర్చలు జరపవలసిన అవసరం ఉన్నదని కేంద్ర బీసీ కమిషన్ భావిస్తోంది.