జాతీయ వార్తలు

ప్రలోభాలకు లొంగవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాగర్/దామహ్, నవంబర్ 24: ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవడంలో ప్రధాని నరేంద్రమోదీ ఘోరంగా విఫలమయ్యారని, ప్రజల ఆశలను, ఆకాంక్షలను వమ్ము చేశారని ఎఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలను కల్పిస్తామని, అర్హులైన ప్రతి ఒక్కరి బ్యాంకు అకౌంట్‌లో రూ.15 లక్షల సొమ్మును జమ చేస్తామన్న హామీని మోదీ గాలికి వదిలేశారన్నారు.
మధ్యప్రదేశ్‌లో సాగర్‌లో ఆయన ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలను మోసం చేసిన బీజేపీకి ఓటు వేయవద్దని కోరారు. నల్లధనం వెలికితీస్తామని చెప్పి పెద్ద నోట్లను రద్దు చేశారని, కాని దీని వల్ల సాధించిందేముందన్నారు. ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురి చేసిన మోదీకి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. 2014 ఎన్నికల్లో ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపెట్టిన ప్రధాని మోదీ ఈ రోజు హామీలను నిలబెట్టుకోలేక పలాయనవాదం పట్టారన్నారు. 2019 ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయం మోదీకి పట్టుకుందన్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్భ్రావృద్ధికి బీజేపీ చేసిందేమీ లేదన్నారు. రైతాంగం తీవ్ర అసంతృప్తితో కొట్టుమిట్టాడుతోందన్నారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఏమి చేశారని ఆయన నిలదీశారు. మోదీ రెచ్చగొట్టే ప్రసంగాలకు లొంగవద్దని, నమ్మవదని ఆయన ప్రజలను కోరారు. మోదీ ప్రసంగాలన్నీ భావోద్వేగంతో కూడుకున్నవని, వీటిల్లో ప్రజలకు ఉపయోగపడేదేమీ ఉండదన్నారు. మోదీ బహిరంగ సభల్లో మాట్లాడేవన్నీ అసత్యాలన్నీ, ప్రలోభాలకు లొంగవద్దని ఆయన అన్నారు.
తన గురించి, తన కుటుంబంపై అసత్యాలు ప్రచారం చేస్తూ కాలక్షేపం చేస్తున్నారని ఆయన మోదీని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి శివరాజ్ మంచి భాషను ఉపయోగిస్తున్నా, మోదీకి హుందగా ఎలా మాట్లాడాలో తెలియదన్నారు.

చిత్రం..ఎఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ