జాతీయ వార్తలు

‘మన్ కీ బాత్’ 50వ ఎపిసోడ్ నేడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 24: ఆలిండియా రేడియో కార్యక్రమం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ 50వ ఎపిసోడ్ ఆదివారం ప్రసారం కానుంది. అక్టోబర్ 2014లో నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ పేరుతో సాంఘిక, జాతీయ, అంతర్జాతీయ విషయాలు, విశేషాలతోపాటు బాలికా విద్య, పరీక్షల్లో ఒత్తిడిని ఎదుర్కోవడం, పర్యావరణ పరిరక్షణ వంటి అనేక అంశాలపై సూచనలు, సలహాలు, ఉదాహరణలతో వివరిస్తున్న విషయం తెలిసిందే. అత్యంత ప్రజాదరణ పొందిన ఈ కార్యక్రమంలో 50వ ఎపిసోడ్ 24వ తేదీ అంటే ఆదివారం ప్రసారమవుతోంది. మొదట్టమొదటి ఎపిసోడ్‌లో ప్రధాని మాట్లాడుతూ ప్రజలందరూ ఖాదీని ధరించి నేత కార్మికులకు జీవం పోయాలని సూచించారు. ఈ కార్యక్రమం అనంతరం ఖాదీ వస్త్రాల అమ్మకం దాదాపు 120 శాతం మేర పెరిగినట్లు పీఎంవో కార్యాలయం తెలిపింది. అలాగే 2014 డిసెంబర్‌లో ప్రసారమైన కార్యక్రమంలో మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని పిలుపిచ్చారు. పరీక్షల్లో ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో వివరిస్తూ మోదీ చేసిన సూచనలు ‘ఎగ్జామ్ వారియర్స్’ పేరుతో పుస్తకంగా రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే. 2015 జనవరిలో మరో ముఖ్యమైన ఎపిసోడ్ ప్రసారమైంది. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతోపాటు అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పాల్గొన్నారు. ఇద్దరి మధ్యా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు చర్చకు వచ్చాయి. 2015 మేలో ప్రసారమైన కార్యక్రమంలో జూన్ 21న నిర్వహించనున్న ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’ గురించి ప్రస్తావించారు. అలాగే 2015 జూన్‌లో ప్రసారమైన ఎపిసోడ్‌లో హర్యానాలోని ఓ గ్రామం గురించి ప్రస్తావించి ‘సెల్ఫీ విత్ డాటర్’ పేరుతో ప్రచారాన్ని ప్రారంభించారు. దానికి దేశ వ్యాప్తంగా విశేషమైన ప్రాధాన్యత లభించిన విషయం తెలిసిందే.