జాతీయ వార్తలు

33 స్థానాల్లో పాత అభ్యర్థులే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, నవంబర్ 24: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో రసవత్తరమైన పోటీ జరుగుతోంది. 200 స్థానాలున్న రాజస్థాన్ అసెంబ్లీలో 33 చోట్ల ప్రత్యక్ష పోటీ నెలకొంది. అంటే 2013 ఎన్నికల్లో తలబడిన బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులే ఇప్పుడూ పోటీ పడడం గమనార్హం. 43 నియోజకవర్గాల్లో ఈసారి అభ్యర్థులను మార్చారు. 124 స్థానాల్లో రెండు పార్టీలూ కొత్త అభ్యర్థులను రంగంలోకి దించాయి. 33 స్థానాల విషయానికి వస్తే 24 మంది బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు పోటీలో ఉన్నారు. అందులో మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఒకరు. కరణ్‌పూర్ స్థానం నుంచి గనుల శాఖా మంత్రి సురేంద్ర పాల్ సింగ్, కాంగ్రెస్ మాజీ మంత్రి గుర్మీత్‌సింగ్ ప్రత్యక్షంగా తలబడుతున్నారు. 2013 ఎన్నికల్లోనూ వీరద్దరే తలబడ్డారు. సురేంద్రపాల్ చేతిలో 3,853 ఓట్ల తేడాతో గుర్మీత్ ఓటమి చెందారు. ఇక హనుమాన్‌గఢ్ నుంచి నీటి వనరుల మంత్రి రామ్‌ప్రతాప్, కాంగ్రెస్ నుంచి వినోద్ చౌదరి పోటీలోఉన్నారు. గత ఎన్నికల్లో వినోద్ చౌదరి ఏకంగా 30వేల పైచిలుకు ఓట్లతో పరాజయం పొందినా కాంగ్రెస్ మళ్లీ ఆయనకే టిక్కెట్ ఇచ్చి నిలబెట్టింది. ఇక్కడ ముఖాముఖి పోటీ నెలకొంది. సికార్ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి రాజేంద్ర పారీక్ బరిలో ఉన్నారు. ఆయనపై బీజేపీ మంత్రి రతన్‌లాల్ జల్ధారీ నిలబడ్డారు. 2013 ఎన్నికల్లో 13,015 ఓట్లతో పారిక్‌పై జల్ధారీ గెలిచారు. ఇక షెక్‌వతీలో త్రిముఖ పోటీ జరుగుతోంది. రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ అభ్యర్థి వాహిద్ చౌహాన్ బరిలోఉన్నారు. గత ఎన్నికల్లో నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసిన చౌహాన్‌కు 29.10 శాతం ఓట్లు వచ్చాయి. అలాగే కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ స్పీకర్ దీపేంద్ర సింగ్ షెకావత్, ఝాబర్ సింగ్ ఖర్రా(బీజేపీ) శ్రీమధోపూర్ నుంచి పోటీలో ఉన్నారు. చౌమూ స్థానంలో బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే రామ్‌లాల్ శర్మ, కాంగ్రెస్ అభ్యర్థి భగవాన్ సహాహీ సైనీ మధ్య ప్రత్యక్ష పోటీ ఉంది. 2013 ఎన్నికల్లో శర్మ 44,473 ఓట్ల మెజారిటీతో గెలిచారు. కీలకమై జైపూర్ నియోజకవర్గంలోనూ గత ఎన్నికల్లో తలబడినవారే బరిలో ఉన్నారు. సామాజిక న్యాయశాఖ మంత్రి అరుణ్ చతుర్వేది, కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి ప్రతాప్‌సింగ్ ఖచారియావాస్ తలపడుతున్నారు. మాల్వియానగర్‌లోనూ అలాంటి పోటీనే నెలకొంది. ఆరోగ్య మంత్రి కాళీచరణ్ సరాఫ్, పీసీసీ ఉపాధ్యక్షురాలు అర్చనా శర్మ మధ్య హోరాహోరీ పోటీ ఉంది.‘అభ్యర్థులు మారలేదు. ఈసారి కాంగ్రెస్‌కే జనం ఓట్లు వేస్తారు. మంత్రి సరాఫ్ అవినీతిలో నిండామునిగారు. కాబట్టి నేనే గెలుస్తాను’అని ఆమె ధీమా వ్యక్తం చేశారు. నాగౌర్ జిల్లాలోని జయాల్ స్థానంలోనే అదేపరిస్థితి. మహిళా అభ్యర్థులు, ఇద్దరి పేర్లలోనూ మంజు అని ఉంటుంది. బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మంజు భాఘ్మార్, కాంగ్రెస్ అభ్యర్థి మంజు దేవీ ఎస్సీ రిజర్వ్ సీటులో తలపడుతున్నారు. జోధ్‌పూర్ సర్దార్‌పూర్ సీటులో సిట్టింగ్ ఎమ్మెల్యే గెహ్లాట్, బీజేపీ అభ్యర్థి శంభూసింగ్ ఖెటాసర్ పోటీపడుతున్నారు. అయితే గెహ్టాల్ నియోజకవర్గానికి చేసిందేమీ లేదని, కులం కలిసొచ్చే అవకాశం ఉందని బీజేపీ అభ్యర్థి చెబుతున్నారు. మొత్తంగా 43 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులను మార్చాయి. ఆ 43 స్థానాల్లో 34 చోట్ల గత ఎన్నికల్లో బీజేపీ కైవసరం చేసుకుంది. 2,294 మంది అభ్యర్థుల్లో 189 మంది మహిళలున్నారు. రాజస్థాన్ అసెంబ్లీకి డిసెంబర్ 7న పోలింగ్ జరగనుంది.