జాతీయ వార్తలు

మధ్యప్రదేశ్‌లో ఓటర్లు మార్పు కోరుతున్నారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారి ప్రజలు మార్పును కోరుతున్నారా ? బీజేపీకి కంచుకోటగా ఉన్న ఈ రాష్ట్రంలో 2003 నుంచి బీజేపీ అప్రతిహతంగా ప్రతి ఎన్నికలో విజయం సాధించింది. ఈ సారి ఎన్నికల్లో ఓటర్లు బీజేపీవైపు మొగ్గు చూపుతున్నారా అనే విషయాన్ని విశే్లషిస్తే విశే్లషకులు చెప్పలేమంటున్నారు. కాని ప్రజలు మార్పును కోరుతున్నారు. ఈ మార్పు బీజేపీని ఓడించి కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చేంత శక్తివంతంగా ఉందా ? మధ్యప్రదేశ్‌లో బుందేల్ ఖండ్, వింధ్య ప్రాంతాలు కీలకమైనవి. బుందేల్ ఖండ్‌లో ఏడు జిల్లాల్లో 26 సీట్లు, వింధ్య ప్రాంతంలో ఏడు జిల్లాల్లో 30 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. 2013 ఎన్నికల్లో బీజేపీకి బుందేల్‌ఖండ్ ప్రాంతంలో 26కు 20 సీట్లు, కాంగ్రెస్‌కు 6 సీట్లు, వింధ్య ప్రాంతంలో బీజేపీకి 16 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు 12 సీట్లు, ఇతరులకు రెండు సీట్లు వచ్చాయి. మొత్తం 56 అసెంబ్లీ సీట్లలో 36 సీట్లు బీజేపీకి, కాంగ్రెస్‌కు 18 సీట్లు, ఇతరులకు రెండు సీట్లు వచ్చాయి. బీజేపీ ఈ రాష్ట్రంలో దాదాపు 14 ఏళ్లుగా అధికారంలో ఉంది. బీజేపీ అంటే వ్యతిరేకత కంటే మొహం మొత్తిందని, కొత్త పార్టీకి అధికారం అప్పగిస్తే కొంత మార్పు ఉంటుందనే భావనతో ఉన్నట్లు యువకులు భావిస్తున్నారు. దళితులు, బీసీల సంక్షేమానికి బీజేపీ ప్రభుత్వం మునుపెన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను చేపట్టింది. కాగా దళితులు, ఇతర బడుగు వర్గాల వారు మాత్రం మార్పు కావాలంటున్నారు. ఈ నియోజకవర్గాల్లో ఓబీసీలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఈ ఓట్లన్నీ తమకే నని బీజేపీ అంటోంది. ఈ వర్గాల తమకు తిరుగులేని విధంగా మద్దతు ఇస్తున్నారని బీజేపీ నేతలంటున్నారు. నార్యోలి గ్రామంలో ఎస్సీ వర్గానికి చెందిన ఒక చిరు వ్యాపారి మాట్లాడుతూ మార్పు కావాలనిపిస్తుందన్నారు. ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నాడు. కాంగ్రెస్‌కు కూడా ఒకసారి అవకాశం ఇస్తే పోయిందేముందని ప్రశ్నించారు. బీజేపీ అంటే వ్యతిరేకత ఏమీ లేదని రోడ్లు, విద్యుత్ కనెక్షన్లు , ఇతర వౌలిక సదుపాయాలు కల్పించిందన్నారు. కాని మార్పు కోరితే తప్పేముందన్నారు. ఒక అవకాశం ఇస్తే కాంగ్రెస్ కూడా బీజేపీ కంటే ఎక్కువ సేవ చేయవచ్చన్నారు. జీఎస్‌టీ వల్ల రేట్లు పెరిగాయి. పెద్ద నోట్ల రద్దు వల్ల ఎంతో నష్టపోయామన్నారు. బిజాయ్ చౌదరి మాట్లాడుతూ మధ్యప్రదేశ్‌లో గతంలో కాంగ్రెస్ ప్రజలను పట్టించుకోలేదు. ఈ రోజు ఒక ఇంట్లో బిడ్డ పుట్టినప్పటి నుంచి పాఠశాల వెళ్లే వరకు, వైద్య సదుపాయాలు, ప్రతి గ్రామానికి అన్ని వౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. ఇంక ఇంత కంటే ఏమి కావాలి అని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ తీవ్రంగానే ఉంటుందన్నారు. కాని రైతాంగం కొంత మేర అసంతృప్తితో ఉన్న మాట నిజమేనని ఆయన అన్నారు. పురానా సింగ్ రైతు మాట్లాడుతూ బీజేపీ ఎంత చేసినా, రైతుల విషయంలో మాత్రం శ్రద్ధ కనపరచలేదన్నారు. చత్రాపూర్ జిల్లా బాడా మల్హేరా అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక బీజేపీ కార్యకర్త గుర్రం మీద ఉత్సాహంగా వెళుతూ కనపడ్డాడు. ఇక్కడ సిటింగ్ ఎమ్మెల్యేకు టిక్కెట్ ఇవ్వలేదని, దీని వల్ల బీజేపీగెలుపు గ్యారంటీ అన్నారు. మధ్యప్రదేశ్‌లో 7.5 కోట్ల జనాభాలో 5.5 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఈ సారి 65 వేల పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. ఈ నెల 28వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 26వ తేదీ సాయంత్రం ప్రచారానికి తెరపడనుంది. డిసెంబర్ 11న ఫలితాలు వెలువడనున్నాయి. మరో 48 గంటల్లో ఎన్నికల ప్రచారం ముగియనుండడంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేశాయి. ప్రధాని నరేంద్రమోదీ, ఎఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీఎస్పీ అధినేత్రి మా యావతి సుడిగాలి పర్యటనలు జరిపారు.
చిత్రం..జబల్పూర్ (మధ్యప్రదేశ్)లో ఈవీఎంలను పరిశీలిస్తున్న ఎన్నికల కమిషన్ సిబ్బంది