జాతీయ వార్తలు

గోవధపై యూపీలో అల్లర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బులంద్‌షాహర్ (యూపీ) డిసెంబర్ 3: అక్రమంగా జంతువధ జరిగిందంటూ చేపట్టిన నిరసన హింసకు దారితీయడంతో మూకదాడిలో ఒక పోలీస్ ఇన్‌స్పెక్టర్ మృతి చెందగా పోలీసు కాల్పుల్లో మరో యువకుడు మృత్యువాత పడిన ఘటన సోమవారం ఉత్తర్ ప్రదేశ్‌లోని బులంద్‌షాహర్‌లో చోటు చేసుకుంది. ఆందోళనకారులు పోలీస్ ఔట్‌పోస్టుపైకి దూసుకెళ్లి దాడికి దిగడంతో పరిస్థితిని అదుపుచేసేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. మీరట్ జోన్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రశాంత్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ మాహవ్ గ్రామస్థులతోబాటు పరిసర గ్రామాల ప్రజలు చింగర్వతీ పోలీస్ ఔట్‌పోస్టుకు నిప్పుపెట్టారని, పోలీసులపై రాళ్లవర్షం కురిపించారని, అక్కడున్న అనేక వాహనాలను ధ్వసం చేశారని తెలిపారు. ఈ అల్లర్లలో ఇన్స్‌పెక్టర్ సుభోద్‌కుమార్ మృత్యువాత పడ్డారన్నారు. అయితే ఇన్స్‌పెక్టర్ హత్యకు దారితీసిన ఘటనపై పూర్తి వివరాలను ఆయన అందించలేదు. కాగా కాల్పుల్లో గాయపడిన సుమిత్ అనే ఇరవై యేళ్ల యువకుడు మృతిచెందినట్లు అధికారులు ఈ సందర్భంగా గుర్తించారు. ఇలావుండగా ఈ ఘటన పూర్వాపరాల్లోకి వెళితే మాహవ్ గ్రామ సమీప అడవుల్లో చంపిపడేసిన ఓ గోవు శరీర భాగాలను గ్రామస్థులు కనుగొనుగొన్నారు. దీంతో ఆగ్రహానికి గురైన గ్రామంలోని వివిధ హిందూ కులస్థులు గోవు కలేబరాన్ని ట్రాక్టర్‌లో గ్రామానికి తీసుకువచ్చారు. అక్కడి నుంచి చింగన్‌వతీ పోలీస్ చౌకీ వద్దకు తరలించి గోవును చంపినవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బులంద్‌షాహర్-గర్హ్ జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. వారిని సముదాయించేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు నిష్ఫలం అయ్యాయని జిల్లా మేజిస్ట్రేట్ అనూజ్‌కుమార్ ఝూ తెలిపారు. సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ అవినాష్ కుమార్ ఘటనా స్థలికి వచ్చే సరికే ఆందోళన హింసాత్మకంగా మారిందని ఝూ తెప్పారు. ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరిపారని వివరించారు. కాగా పరిస్థితిని తెలుసుకునేందుకు తాను హుటాహుటిన ఘటనా స్థలికి వెళుతున్నానని మీరట్ డివిజినల్ కమిషనర్ అనితా సీ మెష్రామ్ తెలిపారు.