జాతీయ వార్తలు

తమిళనాడులో రాజ్‌భవన్ ముట్టడి యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, డిసెంబర్ 3: రాజీవ్ గాంధీ హత్యకేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న ఏడుగురు ఖైదీలను విడుదల చేయాలంటూ సోమవారం తమిళనాడు రాజ్‌భవన్ ముట్టడికి యత్నించిన ఎండీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు వైగో సహా పలువురు నేతలను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఆర్. ముత్తరాసన్, డికే, వీసీకే నేతలు కే. వీరమణి, తొల్ తిరుమావలన్ తదితరులున్నారు. తమిళనాడు గవర్నర్ భన్వర్‌లాల్ పురోహిత్‌కు వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేస్తూ రాజ్‌భవన్ సమీపంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. గత సెప్టెంబర్ 9 ముఖ్యమంత్రి పళనిస్వామి నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశం రాజీవ్ హత్య కేసులో యావజ్జీవ జైలుశిక్ష అనుభవిస్తున్న ఏడుగురు ఖైదీలను ముందస్తుగా విడుదల చేయాలని తీర్మానించినప్పటికీ ఈ విషయాన్ని గవర్నర్ పట్టించుకోలేదని ఆరోపించారు. 2000వ సంవత్సరంలో దివంగత మాజీ సీఎం జయలలిత అరెస్టును నిరసిస్తూ ఏఐడీఎంకే కార్యకర్తలు ఒక బస్సును దగ్ధం చేయగా ముగ్గురు మహిళా విద్యార్థులు సజీవదహనమయ్యారని, ఆ కేసులో కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న ముగ్గురు ఏఐడీఎంకే కార్యకర్తలను విడుదల చేశారని మరి రాజీవ్ హత్య కేసు నిందితుల పట్ల ఎందుకు వివక్ష చూపుతున్నారో తెలపాలని వైకో ప్రశ్నించారు. యావజ్జీవ శిక్షను అనుభవిస్తున్న మురుగన్, శాంతన్, పేరరివాలన్, రవిచంద్రన్, రాబర్ట్ పయాస్, జయకుమార్, నళినిలను జైలునుంచి విడుదల చేయకుంటే గవర్నర్‌కు వ్యతిరేకంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. గవర్నర్ వెలుపలికి వచ్చి తమకు సమాధానం చెప్పాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. కాగా గవర్నర్ పురోహిత్ గత నెలలో దివంగత ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ జయంత్యుత్సవాల నేపథ్యంలో శిక్షను అనుభవిస్తున్న ముగ్గురు ఏఐడీఎంకే కార్యకర్తలు నెడుంజయన్, రవిచంద్రన్, మునియప్పన్‌లను విడుదల చేసేందుకు సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేశారు.