జాతీయ వార్తలు

చట్టసభల్లో పెరుగుతున్న అతివల ప్రాతినిధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: ఎన్నికల్లో పోటీ చేస్తున్న పురుష అభ్యర్థుల కంటే మహిళలకే ఎక్కువ శాతం విజయాన్ని పొందారని, 2014 సాధారణ ఎన్నికలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయని, అయినా పది లోక్‌సభ సీట్లలో కేవలం ఒకరు (10 శాతం) మాత్రమే చట్టసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని సోమవారం ఆక్స్‌ఫర్డ్ ప్రెస్ విడుదల చేసిన ఒక పుస్తకం వెల్లడించింది. ‘ఉమెన్ మెంబర్స్ ఇన్ ది ఇండియన్ పార్లమెంట్’ పేరుతో విడుదలైన ఈ పుస్తకాన్ని శ్రీరాం ఎం రాయ్, కరొల్ స్పారె ఎడిట్ చేశారు. ఇందులో చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళల సంఖ్య, వారి శాతం, ఇతర వివరాలను వివరించారు. 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో 9.3 శాతం మహిళలు మాత్రమే లోక్‌సభకు ఎన్నికయ్యారని, 668 మంది మహిళలు పోటీచేయగా అందులో 62 మంది ఎన్నికయ్యారని, ఇది 9.3 శాతం అని, అయితే అదే ఎన్నికల్లో 7,577 మంది పురుష అభ్యర్థులు పోటీ చేయగా, అందులో 481 మంది గెలిచారని, వీరి గెలుపు శాతం 6.3 శాతమని వివరించారు. దీనిని బట్టి చూస్తే పురుషుల కంటే మహిళల విజయ శాతమే ఎక్కువగా ఉందని అర్థమవుతుందన్నారు. ప్రస్తుత లోక్‌సభలో మహిళల ప్రాతినిధ్య శాతం సుమారు 12 శాతమని, 1951లో జరిగిన మొదటి సాధారణ ఎన్నికలతో పోలిస్తే కేవలం ఏడు శాతం మాత్రమే అధికమని అన్నారు. మొదటి లోక్‌సభ ఎన్నికల్లో 489 మంది సభ్యులకు 24 మంది మహిళలు ఉన్నారని, ప్రస్తుత లోక్‌సభలో ఇద్దరు నామినేటెడ్ ఆంగ్లో ఇండియన్ సభ్యులతో కలిపి మొత్తం 545 మంది సభ్యులు ఉన్నారని తెలిపారు. 2014లో జరిగిన ఎన్నికల్లో 543 స్థానాలకు ఎన్నికలు జరుగగా, 62మంది మహిళలు ఎన్నికయ్యారన్నారు. ఇది కేవలం మొత్తం సభ్యుల్లో 11 శాతం మాత్రమేనని, తర్వాత జరిగిన ఉపఎన్నికలతో వీరి సంఖ్య 66కు చేరడంతో 12 శాతం అయ్యిందని ఈ బుక్ వివరించింది.
ఇక పార్టీల వారీగా చూస్తే అతివలకు కాంగ్రెస్ పార్టీ పెద్ద పీట వేస్తోంది. అదే సమయంలో బీజేపీని చూస్తే 2009 ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి 44 మంది ప్రాతినిధ్యం వహించగా, 2014 ఎన్నికల్లో వారి సంఖ్య 37కు తగ్గింది. అదే సమయంలో కాంగ్రెస్ నుంచి 2009లో 43 మంది మహిళలు, 2014లో 59 మంది మహిళలు పార్లమెంట్‌లో ప్రతినిధులయ్యారు. ఇదిలావుండగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అతివల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. 2004లో వీరి సంఖ్య 355 ఉండగా, 2009లో 556, 2014లో 668 మంది పోటీపడ్డారు. ఇక పురుషుల సంఖ్య చూస్తే సహజంగానే పోటీ చేసేవారిలో వీరి శాతమే అధికంగా ఉంది. అలాగే ఎస్సీ, ఎస్టీ కేటగిరి విభాగాల్లో పోటీ చేసే మహిళల సంఖ్య కూడా పెరుగుతోంది. 2014 ఎన్నికల్లో మొత్తం మీద పోటీ చేసిన మహిళలు 8 శాతం ఉండగా, రిజర్వ్ స్థానాల్లో మాత్రం వీరి శాతం 14 ఉంది. ఎస్సీలకు కేటాయించిన 84 సీట్లలో 12 మంది మహిళలే ఉన్నారని ఆక్స్‌ఫర్డ్ ప్రెస్ ముద్రించిన ఈ పుస్తకంలో పేర్కొన్నారు. ఏది ఏమైనా చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగడం మంచి పరిణామమని, రిజర్వేషన్లు కల్పిస్తే వీరి సంఖ్య మరింత గణనీయంగా పెరుగుతుందని రాజకీయ విశే్లషకులు పేర్కొంటున్నారు.