జాతీయ వార్తలు

లోక్‌సభతో పాటు నాలుగు రాష్ట్రాలకు ఎన్నికలు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిసా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం యోచిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. శాసనసభ పదవీకాలం వచ్చే ఏడాది మే, జూన్ నెలలతో ముగిసే ఈ రాష్ట్రాలతో పాటు జమ్మూకాశ్మీర్ శాసనసభకు సైతం ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ యోచిస్తోంది. ఇప్పటికే జమ్మూకాశ్మీర్ అసెంబ్లీని గవర్నర్ రద్దు చేశారు. ఆరు నెలల్లో ఇక్కడ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. వాస్తవానికి జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ పదవీ కాలమైన ఆరేళ్లు మార్చి 16, 2021తో ముగియాల్సి ఉంది. కాని అసెంబ్లీ రద్దు చేసిన నేపథ్యంలో ఎట్టిపరిస్థితుల్లో వచ్చే ఏడాది మేలోగా దీనికి ఎన్నికలు నిర్వహించాలి. అదే సమయంలో ఏపీ, ఒడిసా, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల శాసనసభ పదవీకాలం ముగియనుంది. సిక్కిం అసెంబ్లీ పదవీ కాలం మే 27న, ఆంధ్రప్రదేశ్, ఒడిసా, అరుణాచల్ అసెంబ్లీల పదవీకాలం జూన్ 18, జూన్ 11, జూన్ ఒకటిన ముగుస్తాయి. ఈ నేపథ్యంలో వీటి ఎన్నికలు సైతం లోక్‌సభ ఎన్నికలతో పాటు నిర్వహిస్తే, ఈవీఎంలు, రవాణా, భద్రతాపరమైన ఏర్పాట్లు ఒకేసారి చేయవచ్చునని, ఖర్చు కూడా తగ్గుతుందని ఎలక్షన్ కమిషన్ అధికారి ఒకరు తెలిపారు. ఇదిలావుండగా ఈ నాలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల ఎన్నికలు సైతం లోక్‌సభ ఎన్నికలతో నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. ప్ర స్తుతం ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. వీటి శాసనసభ పదవీకాలం వచ్చే ఏడాది నవంబర్ వరకు ఉన్నా, వీటిని ముందే రద్దు చేసి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే అవకాశాలను కొ ట్టిపారేయలేమని బీజేపీ నేత ఒకరు తెలిపారు. వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల సమయంలోనే అసెంబ్లీ ఎన్నికలు కూడా ఏకకాలంలో ని ర్విహిస్తే భద్రతా దళాలు, శాంతిభద్రతల సమ స్య కూడా పెద్దగా ఉండదని ఆయన చెప్పారు.