జాతీయ వార్తలు

గెలుపు మాదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జోధ్‌పూర్: రాజస్థాన్‌లో అధికారం తమదేనన్న కాంగ్రెస్ పార్టీ ఆశలు బెడిసి కొట్టడం ఖాయమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఒకే పార్టీ వరుసగా రెండుసార్లు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవు కాబట్టే..ఈ సారి అధికారం తమకే దక్కుతుందని కాంగ్రెస్ ఆశిస్తోందని, కానీ సంప్రదాయానికి భిన్నంగా రాష్ట్ర ప్రజలు తీర్పునివ్వబోతున్నారని ఉద్ఘాటించారు. సోమవారం ఇక్కడ జరిగిన ఓ ర్యాలీలో మాట్లాడిన మోదీ 2014 నుంచి ఇప్పటి వరకూ జరిగిన అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వరుస పరాజయాలను చవిచూస్తూనే వస్తోందని, ప్రస్తుత రాజస్థాన్ ఎన్నికల్లోనూ ఆ పార్టీ ఆశలు వమ్ముకావడం తధ్యమని అన్నారు. నాలుగు తరాల పాటు దేశాన్ని పాలించిన ఓ కుటుంబం మహాత్మా గాంధీ స్వచ్ఛ ఆదర్శాలు, ఆశయాలను తుంగ లో తొక్కారని ధ్వజమెత్తారు. దేశ ప్రజ లు కేవలం తమ కుటుంబాన్ని మా త్రమే గుర్తుంచుకునేలా కాంగ్రెస్ ప్రయత్నించిందన్నారు. అయితే మహాత్ముడి ఆశయాలను అమలు చేసే బాధ్యత తనపై పడిందని చెప్పారు. అన్ని విధాలుగా భారత్ దేశంలో స్వచ్ఛతకు పట్టం కట్టామని, విదేశీయులు సైతం తమ వివాహాలను భారత్‌లో చేసుకుంటున్నారని చెప్పారు. హిందూమతంపై తన పరిజ్ఞానం ఎంత అంటూ ప్రశ్నించిన కాంగ్రెస్‌పై స్వరంతో ధ్వజమెత్తారు. ‘నేను ఓ చిన్న కార్మికుడిని..హిందూమతంపై పూర్తి పట్టు ఉందని ఎప్పుడూ చెప్పలేదు. కానీ అనువంశిక రాజకీయాలు చేస్తున్న వారికే దీనిపై మాట్లాడే హక్కు ఉంటుంది’ అంటూ వ్యంగ్యోక్తి విసిరారు.ఈ సందర్భంగా భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పేరును కూడా ప్రస్తావించిన మోదీ ‘విదేశీ దాడుల్లో ధ్వంసమైన సోమ్‌నాథ్ ఆలయ పునరుద్ధరణ కార్యక్రమానికి తొలి రాష్టప్రతి రాజేంద్ర ప్రసాద్ హాజరుకావడాన్ని నెహ్రూ వ్యతిరేకించారు’అని అన్నారు. ఆ ఆలయాన్ని పునరుద్ధరించింది సర్దార్ వల్లభాయ్ పటేలేనని గుర్తు చేశారు. ప్రస్తుతం భారత ప్రజలు రాజేంద్ర ప్రసాద్ జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నారని స్పష్టం చేసిన మోదీ తప్పుడు ప్రచారం చేయడంలో కాంగ్రెస్ పార్టీ ఓ విశ్వవిద్యాలయ స్థాయిని సంతరించుకుందన్నారు. ఎవరు ఎంతగా అబద్దాలను చెబుతారో, తప్పు డు ప్రచారం చేస్తారో వారికే ఆ పార్టీలో ఎక్కువ పదవులు దక్కుతాయని,ఈ విషయంలో రాహుల్ గాంధీకి ఎంతో సామర్థ్యం ఉందని విమర్శించారు.
చిత్రం..రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా సోమవారం
జోథ్‌పూర్‌లో జరిగిన ఓ ర్యాలీలో మాట్లాటుతున్న ప్రధాని నరేంద్ర మోదీ