జాతీయ వార్తలు

మీకు అధికారమే సర్వస్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హనుమాన్‌గర్ (రాజస్థాన్), డిసెంబర్ 4: ఇప్పుడు పాకిస్తాన్ దేశంలో ఉన్న కర్తాపూర్ వాస్తవానికి భారత్ భూభాగంలోనిదని, స్వాతంత్య్ర సమయంలో అప్పటి నేతలకు ముందు చూపులేకపోవడం, సిక్కుల మనోభావాలను గౌరవించకపోవడం వల్ల అది ఆ దేశానికి వెళ్లిపోయిందని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు.
ఇక్కడ జరిగిన ఎన్నికల సభలో ఆయన ఇటీవల భారత్-పాక్ సరిహద్దులో కర్తాపూర్ నడవా (కారిడార్) శంకుస్థాపన జరిపిన విషయాన్ని ప్రస్తావించారు. ఇదే పనిని కాంగ్రెస్ 70 ఏళ్లక్రితమే ఎందుకు చేయలేదని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు కర్తాపూర్ పాకిస్తాన్ భూ భాగంలో ఉన్నదంటే అప్పట్లో కాంగ్రెస్ నేతలకు గురునానక్ గొప్పదనం తెలియకపోవడం, సిక్కుల సెంటిమెంట్లను గౌరవించకపోవడం కారణమని ఆయన ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ చేసిన తప్పులకు దేశం మూల్యం చెల్లించుకుంటోందని అన్నారు. అప్పట్లో కాంగ్రెస్‌కు చెందిన విధాన నిర్ణేతలు తాము అధికారంలోకి రావాలన్న తపనతోనే దేశ విభజన సమయంలో అన్నింటికీ తల ఊపారని మోదీ ఆరోపించారు. దానివల్లే సిక్కులకు ఎంతో పవిత్రమైన కర్తాపూర్ పాక్ భూభాగంలోకి వెళ్లిపోయిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ నాయకులు కొద్దిగా తెలివితేటలు, వివేకంతో ఆలోచించి ఉంటే భారత్‌కు కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్తాపూర్ ఇప్పుడు మన దేశంలోఉండేదని అన్నారు.
70 సంవత్సరాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ హయాంలో ఎన్నో యుద్ధాలు జరిగాయని, వాటిలో విజయం కూడా సాధించిందని, అయితే కర్తాపూర్‌లో ప్రార్థనలు జరిపేందుకు ఏర్పాట్లు చేయడంలో పూర్తిగా విఫలమైందని మోదీ విమర్శించారు. అయితే వారు చేసిన తప్పులను సరిచేయడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తున్నట్టు ఆయన చెప్పారు. ఈ ఘనత మోదీది కాదని, ఓటర్లయిన మీకు చెందుతుందని ఆయన పేర్కొన్నారు. ఓటు విలువను ఎవరూ తక్కువగా అంచనా వేయవద్దని అన్నారు. ఇటీవల దేశంలో జరిపిన సర్జికల్ దాడులను ఆయన ప్రస్తావిస్తూ పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులు ఏమాత్రం జంకూగొంకూ లేకుండా మనదేశ సరిహద్దులోకి ప్రవేశించి మనసైనికులను, పౌరులను చంపుతుంటే వారికి బుద్ధి చెప్పడానికే తాము ఆ దేశ సరిహద్దులోకి ప్రవేశించి దాడులు జరిపామని అన్నారు. దేశంలోని రైతులు విద్యుత్ ఉత్పత్తిదారులుగా కూడా చేయాలనుకుంటోందని ఆయన చెప్పారు. పొలాల్లో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుతో పాటు వ్యవసాయంలో నూతన సాంకేతిక పద్ధతులైన డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలాంటివి ప్రవేశపెట్టేలా రైతులను ప్రోత్సహిస్తున్నామన్నారు.
రాహుల్‌కు తేడా తెలియదు
వ్యవసాయం, రైతుల గురించి ఉపన్యాసాలు ఇచ్చే రాహుల్‌గాంధీకి పచ్చి మిరపకాయకు, పండు మిరపకాయకు తేడా తెలియదని మోదీ విమర్శించారు. మనం ఎవరైనా ఆ యువరాజు (రాహుల్)కి పచ్చిమిరపకాయల కన్నా పండు మిరపకాయలు పండిస్తేనే రైతులకు ఎక్కువ ఆదాయం వస్తుందని చెప్పామనుకో.. పండుమిరపకాయలే పండించమని ఆయన రైతుకు చెబుతారని ఎద్దేవా చేశారు. రైతు బిడ్డ అయిన సర్దార్ పటేల్‌ను కనుక మనదేశ మొదటి ప్రధానిగా చేసి ఉంటే రైతులు 70 ఏళ్లుగా ఈ కష్టాలు పడి ఉండేవారు కాదని ఆయన అన్నారు. నాలుగు తరాల వారు చేసిన తప్పులకు రైతులు ఇప్పుడూ బాధను అనుభవిస్తూనే ఉన్నారన్నారు. కాని కాంగ్రెస్ వారు మాత్రం ఎన్నికల వస్తున్నాయంటే చాలు రైతు జపం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ నేతలు చలువ గదుల్లో కూర్చుని బీజేపీని ఎలా దించేయాలా అని పథకాలు వేస్తున్నారని ఆయన విమర్శించారు. రాజస్థాన్ రాష్ట్రంలో బీజేపీ తిరిగి అధికారాన్ని చేపడుతుందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు.