జాతీయ వార్తలు

బులందర్‌షహర్ ఘటనపై రాహుల్ దిగ్భ్రాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 5: యూపీలోని బులందర్‌షహర్‌లో ఇద్దరు పోలీసు అధికారులపై దాడి చేసి చంపడం దారుణమని, బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ డిమండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాలనలో పోలీసులకే రక్షణ లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఈ ఘటనలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయన్నారు. మూక హింసకు పోలీసులు బలయ్యారన్నారు. సామాన్యులను భయభ్రాంతులు చేస్తున్నారన్నారు. పోలీసు అధికారి సుబోధ్ సింగ్‌ను ప్రజలు దాడి చేసి హత్య చేయడం అమానుషమన్నారు. మోదీ, యోగి పాలనలో ప్రజలను మతం ప్రాతిపదికన విభజిస్తున్నారన్నారు. హిందుత్వ వాదుల పాశవిక దాడికి ఈ ఘటన నిదర్శనమన్నారు.