జాతీయ వార్తలు

సీబీఐ పరువు తీశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 5: జాతీయ దర్యాప్తు సంస్థ సీబీఐలో ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య తలెత్తిన విభేదాలపై సుప్రీం కోర్టులో కేంద్రం తన వాదనలు వినిపించింది. సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ అస్థానాల మధ్య గొడవను కేంద్రం ఓ పరిహాసంగా అభివర్ణించింది. అత్యున్నత సంస్థకు చెందిన ఇద్దరు ఉన్నతాధికారులు బహిరంగ విమర్శలకు దిగడం సీబీఐను అవహేళన చేసేదిగా ప్రభుత్వం తప్పుపట్టింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ సారధ్యంలోని ధర్మాసనం ఎదుట బుధవారం అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వివరణ ఇచ్చారు. ‘డైరెక్టర్, స్పెషల్ డైరెక్టర్ కొట్లాక సీబీఐ ప్రతిష్టను దిగజార్చింది’అని ఏజీ వ్యాఖ్యానించారు. ఇలాంటి పోకడలను ఎంతమాత్రం సహేతుకం కాదని ఆయన అన్నారు. ఇవి అత్యున్నత సంస్థ పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని కేకే తెలిపారు. ఇప్పటికైనా ఇద్దరు అధికారులు మెట్టుదిగి సంస్థ సమగ్రతను కాపాడాలని, పరిస్థితి చక్కదిద్దడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని జస్టిస్ ఎస్‌కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్‌తో కూడిన ధర్మాసనానికి తెలిపారు.‘అలోక్‌వర్మ, రాకేష్ అస్థానా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుని సీబీఐ పరువుతీసేలా వ్యవహరించారు’అని అటార్నీ జనరల్ స్పష్టం చేశారు. ఇదో అరుదైన, వాంఛనీయం కాని పరిణామంగా వేణుగోపాల్ వ్యాఖ్యానించారు.