జాతీయ వార్తలు

శాంతే శిరోధార్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయోధ్య, డిసెంబర్ 6: అయోధ్యలో వివాదస్పద బాబ్రీమసీదును కూల్చి 26 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో పట్టణంలోని విద్యావేత్తలు, పౌరులు, విద్యార్థులు శాంతి కావాలని కోరుతున్నారు. వివిధ వర్గాలకు చెందిన ప్రజలు తమ పిల్లలకు మంచి చదువు కావాలని, ఈ వివాదం శాంతియుతగా పరిష్కారం కావాలంటున్నారు. స్థానిక గౌతమ్ బుద్ద్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ టీచర్ నీలయ్ తివారీ మాట్లాడుతూ, రామమందిర నిర్మాణం వివాదం కారాదన్నారు. వివిధ పార్టీలు ధర్మం వర్థిల్లిన రోజు, సాహసమైన రోజు, దుఃఖ దినాన్ని పాటించాయి. బయటప్రపంచంలో అయోధ్య వివాదంపై ఏదేదో మాట్లాడుతున్నారు. కాని ఇక్కడ మాత్రం ప్రజలు వాస్తవంలో ఉన్నారని తివారీ చెప్పారు. మీడియా, ఇతర ప్రముఖుల తాకిడి పెరిగింది. కాని ప్రజలకు మాత్రం ప్రతి రోజూ ఎప్పటిలాగానే సాధారణంగానే గడుస్తోందని చెప్పారు. ప్రొఫెసర్ మనోజ్ దీక్షిత్ మాట్లాడుతూ, విద్యార్థులు చదువులపైన దృష్టి పెట్టాలి, ఈ వివాదంపై ఆలోచించడం వల్ల ప్రయోజనం లేదన్నారు. రాజకీయాలతో అనుబంధం ఉంటే మనం చేయగలిగేదేమీ ఉండదన్నారు. ఇక్కడ విద్యాసంస్థలు ప్రశాంతంగా పనిచేస్తున్నాయన్నారు. గత నెల 25వ తేదీన వీహెచ్‌పీ ధర్మ సభను నిర్వహించినా, ఇక్కడ ప్రజలు తమపనితాము చేసుకున్నారన్నారు. సుప్రీంకోర్టు వీలైనంత త్వరలో తీర్పు ఇస్తే బాగుంటుందని స్థానిక ప్రజలు కోరుతున్నారు. అప్పుడే రాజకీయాలకు తెరపడుతుందని భావిస్తున్నారు. సాకేత్ మహావిద్యాలయ విద్యార్థి సంఘం మాజీ నేత గౌరవ్ మన్ త్రిపాఠీ మాట్లాడుతూ, ఈ నగర పౌరులుగా ఉండడం తమకు గర్వంగా ఉందన్నారు. స్థానిక వర్శిటీలో ఉద్యోగి వత్సల తివారీ మాట్లాడుతూ తాను చిన్నప్పటి నుంచి రామాలయం కోసం రకరకాల ఉద్యమాలను చూస్తున్నారని, ఎంతో మంది వీఐపీలు, ప్రజలు వచ్చి వెళుతున్నారన్నారు. 1992 డిసెంబర్ 6వ తేదీన కరసేవకులు మసీదును కూల్చివేసిన విషయం విదితమే.