జాతీయ వార్తలు

ప్రధాన ఆర్థిక సలహాదారుగా కృష్ణమూర్తి సుబ్రహ్మణియన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 7: కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా హైదరాబాద్ ఐఎస్‌బీకి చెందిన ప్రొఫెసర్ కృష్ణమూర్తి సుబ్రహ్మణియన్‌ను నియమిస్తూ కేంద్రం ఆదేశాలు జారీచేసింది. ఆయన ఈ పదవిలో మూడేళ్ల పాటు ఉంటారు. అరవింద్ సుబ్రహ్మణియన్ ప్రధాన ఆర్థిక సలహాదారు పదవికి రాజీనామా చేయడంతో ఆ పదవి కొన్ని నెలలుగా ఖాళీగా ఉంది. ఆయన ఆ పదవిలో నాలుగేళ్లపాటు ఉన్నారు. కృష్ణమూర్తి సుబ్రహ్మణియన్‌ను ఆర్థిక సలహాదారుగా నియమిస్తూ కేంద్రం నోటిఫికేషన్‌ను శుక్రవారం జారీ చేసింది. ఐఐటీ, ఐఐఎం డిగ్రీలు పూర్తి చేసిన ఆయన యూనివర్శిటీ ఆఫ్ చికాగో నుంచి ఆర్థిక శాస్త్రంలో పీహెచ్‌డీ చేశారు. ఈ పోస్టుకు కేంద్రం గత జూలైలో దరఖాస్తులను ఆహ్వానించింది. బ్యాంకింగ్, కార్పోరేట్ గవర్నెన్స్, ఆర్థిక విధానాల్లో కృష్ణమూర్తి సుబ్రహ్మణియన్ నిపుణులు. సెబి కార్పోరేట్ గవర్నెన్స్, ఆర్థిక విధానాల కమిటీలో ఆయన సభ్యులుగా పనిచేశారు. ఆర్‌బీఐలో కూడా కీలక పదవులను నిర్వహించారు. బందన్ బ్యాంక్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ మేనేజిమెంట్, ఆర్‌బీఐ అకాడమీ బోర్డుల్లో ఆయన సభ్యులుగా ఉన్నారు. జెపీ మోర్గన్ న్యూయార్కు కనె్సల్టెంట్‌గా ఉన్నారు.