జాతీయ వార్తలు

పౌరసత్వ బిల్లును వెనక్కి తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌహతి, డిసెంబర్ 7: పౌరసత్వ సవరణ బిల్లు- 2016ను వ్యతిరేకిస్తున్న నార్త్ ఈస్ట్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (ఎన్‌ఈఎస్‌ఓ), క్రిషక్ ముక్తి సంగ్రామ్ సమితి (కేఎంఎస్‌ఎస్) ఆ బిల్లును నిరసిస్తూ వచ్చే శీతాకాల పార్లమెంటు సమావేశాల సందర్భంగా, పార్లమెంటు ఎదుట ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించాయి.
ఏడు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ప్రధాన విద్యార్థి సంఘాలతో కూడిన ఎన్‌ఈఎస్‌ఓ డిసెంబర్ 19న పార్లమెంటు సమావేశాలు ప్రారంభం అయిన తరువాత పార్లమెంటు ముందే ఆందోళన చేట్టాలని నిర్ణయించిందని దాని సలహాదారు సముజ్జల్ భట్టాచార్య శుక్రవారం ఇక్కడ విలేఖరులకు తెలిపారు. ‘మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ బిల్లును ఆమోదించనివ్వబోము. అక్రమంగా వలస వచ్చే బంగ్లాదేశీయులకు ఈశాన్య రాష్ట్రాలు డంపింగ్ గ్రౌండ్ కాదు. అందువల్ల ఆ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళన కొనసాగిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు. 1985 నాటి చరిత్రాత్మక అస్సాం ఒప్పందాన్ని ఈ బిల్లు ఉల్లంఘిస్తోందని ఆయన అన్నారు. అస్సాంలోని పౌరుల నేషనల్ రిజిస్టర్‌ను తాజా పరచడానికి ప్రస్తుతం కొనసాగిస్తున్న ప్రక్రియను ఈ బిల్లు నిరర్థకం చేస్తుందని ఆయన హెచ్చరించారు.
‘ఈశాన్య రాష్ట్రాలలో ఏదీ కూడా ఒంటరిగా లేదని కేంద్రం అర్థం చేసుకోవాలి. మొత్తం ఏడు రాష్ట్రాలు అస్సాం, మిజోరం, మేఘాలయ, మణిపూర్, అరుణచాల్‌ప్రదేశ్, త్రిపుర, నాగాలాండ్ తమ అస్థిత్వం, భాష, సంస్కృతి పరిరక్షణ కోసం చేస్తున్న పోరాటంలో ఐక్యంగా ఉన్నాయి’ అని ఆయన పేర్కొన్నారు.
కెఎంఎస్‌ఎస్ మరో 69 స్థానిక సంస్థలు, మద్దతిస్తున్న సంస్థలతో కలిసి ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 9నుంచి ఢిల్లీలో నిరవధిక నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించింది.